Pocharam Srinivas Reddy: ఆసుపత్రి నుంచి తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డిశ్ఛార్జ్
ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని హస్పిటల్ నుండి డాక్టర్లు ఆయనను డిశ్చార్జి చేశారు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం ఆయన ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నవంబర్ 24 న ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్ రావడంతో స్పీకర్ పోచారం ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో హస్పిటల్ నుండి డాక్టర్లు ఆయనను డిశ్చార్జి చేశారు. అయితే ఇంటికి వెళ్లిన తరువాత కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ కోవిడ్19 నిబంధనలు పాటించాలని స్పీకర్‌కు వైద్యులు సూచించారని తెలుస్తోంది.
ఇటీవల మనవరాలి వివాహం..
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం వారం రోజుల కిందట జరిగింది. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్‌ఆర్ ఫామ్స్‌లో పోచారం మనవరాలి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. మనవరాలి వివాహం అనంతరం జ్వరం, కరోనా లక్షణాలు కనిపంచడంతో కరోనా టెస్టులకు వెళ్లారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. కొవిడ్ 19 నిర్ధారణ టెస్టుల్లో పాజిటివ్ అని తేలడంతో ముందు జాగ్రత్తగా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో వైద్యులు పోచారంను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిపోయిన స్పీకర్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Also Read: YS Sharmila: సీఎం కేసీఆర్ ఓ హంతకుడు..! వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు, కవిత టార్గెట్‌గా ట్వీట్
ఎటువంటి సమస్యలు లేకపోవడంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో ఈరోజు హస్పిటల్ నుండి డిశ్చార్జి చేసిన డాక్టర్లు..
— Pocharam Srinivas Reddy (@PSRTRS) November 27, 2021
మరికొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్న సభాపతి పోచారం గారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా అని తేలగానే ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోచారానికి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇద్దరు సీఎంలు కరోనా నుంచి తప్పించుకున్నారు. అయితే తాజాగా ఓమిక్రాన్ అని కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి పలు దేశాలకు వ్యాప్తి అవుతున్న ఈ కరోనా వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైనదిగా గుర్తించారు. డబ్ల్యూహెచ్‌వో సైతం ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !