Nizamabad News: సూసైడ్ చేసుకున్న టీచర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నేతల అరెస్టు
ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. 317 జీవోను నిరసిస్తూ సూసైడ్ చేసుకున్న టీచర్. కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నేతల అరెస్టు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయురాలి ఆత్మహత్యపై దుమారం రేగుతోంది. ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమె కుటుంబాన్ని పరామర్శిస్తున్నాయి. ఈ ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ టీచర్ సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నాయకులను అరెస్టులు చేయడాన్ని తప్పుపట్టారు.
నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ బేతల సరస్వతి కుటుంబాన్నిపరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు మాజీ ప్రభుత్వ విప్ అనిల్, జీవన్ రెడ్డిని కమ్మరిపల్లి వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా కమ్మరిపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిoచారు పార్టీ నాయకులు.
కాంగ్రెస్ నేతలనే కాదు బిజెపి లీడర్లను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సరస్వతి అంతక్రియల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్యెల్యే యెండల లక్ష్మినారాయణ పాల్గొన్నారు. సరస్వతిది ప్రభుత్వ హత్యేనంటూ ఆరోపిస్తున్నారు విపక్ష నాయకులు.
317 జీవోను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతికరేకిస్తున్నారు. 317 జీవో అసంబద్దంగా తీసుకోచ్చారని ఆరోపించారు. 317 జీవో రెసిడెన్షియల్ ఆర్డర్ కి వ్యతిరేకంగా ఉందని అన్నారు. సీనియర్ టీచర్లు చాలా మంది స్థానికతను కోల్పోతున్నారని అన్నారు. కొత్తగా వచ్చిన టీచర్లకు సైతం బలవంతంగా వేరే ప్రాంతాలకు పంపించి అక్కడే శాశ్వతంగా పనిచేయాలనటం బాధాకరమంటున్నారు. ఈ సమస్యను మానవతా దృక్ఫధంతో పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ను కోరారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. బలవంతంగా మమ్మల్ని ట్రాన్ ఫర్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పటి వరకు 9 మంది టీచర్లు చనిపోవటం బాధాకరమని అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు.
Also Read: మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం ఇంతలో సూసైడ్... ఖమ్మం లాడ్జ్ లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Also Read: మా చావుకు కారణం ఆ నలుగురే.. అస్సలు వదలొద్దు.. నిజామాబాద్ ఫ్యామిలీ సెల్ఫీ వీడియో వెలుగులోకి..
Also Read: కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..
Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?
Also Read: ఏపీలో నైట్ కర్ఫ్యూ... థియేటర్లలో 50 శాతం సిట్టింగ్... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష