News
News
X

Nizamabad News: నిజామాబాద్‌ మేలుకోని అధికార యంత్రాంగం-వరి రైతుల్లో టెన్షన్

నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నా... పూర్తిస్థాయిలో సన్నద్దత అధికార యంత్రాంగంలో కనిపించడం లేదు.

FOLLOW US: 

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయ్. వరి కోతల్లో రైతులు బిజీగా ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ముందే కోతలు పూర్తి చేసిన వరి రైతులు...ధాన్యం అమ్మటానికి ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాక అవస్థలు పడుతున్నారు. తక్కువ రేటుకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది ఆందోళన చెందుతున్నారు. 

పూర్తి స్థాయిలో రైస్ మిల్లుల అలాంట్మెంట్ కాలేదని తెలుస్తోంది. ధాన్యం సేకరణలో కీలకపాత్ర పోషించాల్సిన పౌర సరఫరాల సంస్థకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడం సమస్యగా మారుతోంది. ఇటీవల డీఎస్వోగా బదిలీపై వచ్చిన అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయినా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ధాన్యం సేకరణ సమయం ముంచుకొస్తున్నా రైస్ మిల్లుల అలాట్మెంట్, గన్నీ బ్యాగుల సరఫరా, ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. తద్వారా ధాన్యం సేకరణకు జాప్యం జరిగుతోంది.

జిల్లాలో ధాన్యం సేకరణకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సొసైటీ ఛైర్మన్లు కూడా భావిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ప్రక్రియ సజావుగా సాగాలంటే అదనపు కలెక్టర్ సహా డీఎస్పీ, డీఎం, డీసీవో, ఇతర అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలకు టెండర్‌కు లారీల యజమానులు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. గత్యంతరం లేక ఓ సంస్థకు రవాణా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇవేగాక ధాన్యం సేకరణలో కడ్తా, నగదు జమ, తదితర సమస్యలు ప్రతి సీజన్లో ఉత్పన్నమవుతాయి.

పౌరసరఫరాల శాఖ అధికారులు 10 లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 477 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1.20 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని. కమిషనర్ ఆదేశాల మేరకే ట్రాన్స్పోర్ట్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగిందని చెబుతున్నారు. 305 రైస్ మిల్లులకుగాను కేవలం 142 మిల్లులకే అలాట్మెంట్ ఇచ్చారు. 

News Reels

ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కోతలు అయిన వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా జరగటంతో వర్షానికి రైతులు భారీగా ధాన్యం నష్టపోయారు. ఈసారి అలా కాకుండా వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోళు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. 

Published at : 04 Nov 2022 12:56 PM (IST) Tags: paddy Nizamabad Latest News Nizamabad Updates Nizamabad News NIzamabad

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Kamareddy News : సోది క్లాస్ అంటూ ఇన్ స్టాలో స్టూడెంట్స్ పోస్ట్, పచ్చికట్టెలు విరిగేలా కొట్టిన టీచర్!

Kamareddy News : సోది క్లాస్ అంటూ ఇన్ స్టాలో స్టూడెంట్స్ పోస్ట్, పచ్చికట్టెలు విరిగేలా కొట్టిన టీచర్!

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?