News
News
X

Nizamabad Crime: ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం - సెకండియర్ వర్సెస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, వేధింపుల ఆరోపణలు!

Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలోని తిరుమల ఫార్మసీ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లు జూనియర్ల  మధ్య గొడవ జరగగా.. ఇద్దరూ వేర్వేరుగా పోలీసులను ఆశ్రయించారు. 

FOLLOW US: 
Share:

Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తిరుమల ఫార్మసీ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. రెండో ఏడాది, మూడో ఏడాది చదువుతున్న విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ర్యాగింగ్ చేశారంటూ జూనియర్లు పోలీసులను ఆశ్రయించారు. వీరికంటే ముందే సీనియర్లు సీపీని కలిసి ర్యాగింగ్ జరగలేదని.. కేవలం గొడవ మాత్రమే జరిగిందని వివరించారు. మరోవైపు రెండో ఏడాది విద్యార్థులు ఈ విషయం గురించి మీడియాకు తెలిపినందుకుగాను యాజమాన్యం వారిని కళాశాల నుంచి సస్పెండ్ చేసింది. వారి తల్లిదండ్రులకు సైతం పోలీసుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

తిరుమల ఫార్మసీ కళాశాలలో ఈనెల 19వ తేదీన స్వాగతోత్సవం ఉంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ.. సెకండియర్ స్టూడెంట్స్ చేస్తున్న వేడుక ఇది. ఈ వారం మొత్తం ఆ కళాశాలలో ఫ్రెషర్స్ వీక్ గా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే 13వ తేదీన సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. మూడో ఏడాది విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారని, వాష్ రూమ్స్ కు వెళ్లేటప్పుడు అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ రెండో సంవత్సరం ఫార్మసీ విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ర్యాగింగ్ కు పాల్పడ్డ విద్యార్థులను సస్పెండ్ చేస్తామని యాజమాన్యం వెల్లడించింది. స్వాగతోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందించేందుకు వెళ్లిని విద్యార్థినిలతో అసభ్యంగా మాట్లాడారంటూ రెండో ఏడాది విద్యార్థినీ, విద్యార్థులు ఆందోళనకు దిగారు. 

బాధితులనే బాధ్యులు చేస్తున్నారంటూ ఆరోపణలు..

తాము కళాశాలలో చేసిన అలంకరణను సీనియర్లు ధ్వంసం చేసి తమపై దాడి చేశారని రెండో ఏడాది విద్యార్థులు ఆరోపించారు. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రమైంది. తల్లిదండ్రులకు విషయం తెలిసి పోలీసులకు చెప్పగా వివాదం సద్దుమణిగేలా చేశారు. ఆందోళనకు కారణమైన కొంత మంది విద్యార్థులను డిచ్ పల్లి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని.. కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే సీనియర్ విద్యార్థులను వదిలేసి తమ క్లాస్ వాళ్లనే బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారని రెండో ఏడాది విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీనియర్స్ తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతకు ముందే సీనియర్ విద్యార్థినులు కూడా సీపీకీ ఫిర్యాదు చేశారు. అసలు ర్యాగింగ్ జరగలేదని, కేవలం గొడవ మాత్రమే జరిగిందని వివరించారు. జూనియర్లే తమను వేధించారని సీనియర్ విద్యార్థినులు చెబుతున్నారు. 

విద్యార్థినులు, తల్లిదండ్రులపై యాజమాన్యం ఆగ్రహం

కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కళాశాలలో అంత పెద్ద గొడవ జరుగుతుంటే కనీసం పట్టించుకోకపోవడం దారుణం అని అంటున్నారు. కళాశాల యాజమాన్యం సైతం గొడవ అయ్యేదాకా కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు, తల్లిదండ్రులను.. ఎందుకు చెప్పారంటూ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు ఘటనపై మీడియాతో మాట్లాడిన నలుగురు రెండో ఏడాది విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు బాధిత విద్యార్థినులు చెబుతున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులను సైతం డిచ్ పల్లి పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిసింది. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కళాశాల యాజమాన్యం వివాదం సద్దుమణిగేలా చూడాల్సిన అవసరం ఉంది. 

Published at : 17 Mar 2023 08:47 PM (IST) Tags: Ragging Nizamabad Crime News Telangana News Tirumala Pharmacy College Ragging problems

సంబంధిత కథనాలు

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Kamareddy: కాంగ్రెస్ లో వర్గపోరు - టిక్కెట్ల గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్న మదన్ మోహన్

Kamareddy: కాంగ్రెస్ లో వర్గపోరు - టిక్కెట్ల గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్న మదన్ మోహన్

Nizamabad Politics: రేవంత్ రెడ్డి పాదయాత్రతో నిజామాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!

Nizamabad Politics: రేవంత్ రెడ్డి పాదయాత్రతో నిజామాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!

Nizamabad News: అకాల వర్షంతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం- క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని రేవంత్ డిమాండ్

Nizamabad News: అకాల వర్షంతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం- క్రాప్‌ ఇన్సూరెన్స్‌  అమలు చేయాలని రేవంత్ డిమాండ్

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం