Crime News: అత్తపై లైంగిక దాడి యత్నం, మరోదారి లేక అల్లుడ్ని కొట్టి చంపిన వృద్ధురాలు
భార్య వేరే రాష్ట్రానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తపై కన్నేశాడు. లైంగిక దాడికి యత్నించిన అల్లుడ్ని అత్త హతమార్చింది. నిర్మల్ జిల్లాలోని ముథోల్‌లో ఘటన జరిగింది.

Nirmal Crime News | ముథోల్: భార్య పని మీద వేరే ప్రాంతానికి వెళ్లగా అత్త మీద కన్నేశాడు. తన ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె పదే పదే హెచ్చరించినా మద్యం మత్తులో మరోసారి లైంగిక దాడికి యత్నించిన అల్లుడ్ని కొట్టి చంపేసింది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది.
తల్లిలాగ చూసుకోవాల్సిన అత్తమీద లైంగిక దాడులకు పాల్పడుతూ వేధిస్తున్న అల్లుడ్ని అత్త హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న అల్లుడు అత్త(68)పై లైంగికదాడికి యత్నించడంతో, ప్రతిఘటించిన బాధితురాలు దారుణం నుంచి తప్పించుకునేందుకు అతన్ని హత్య చేసింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌కు చెందిన షేక్ నజీం (45) గత పదేళ్లుగా తన భార్య, కుమారుడు, అత్తతో కలిసి నిర్మల్ జిల్లాలోని తరోడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల నజీం మద్యం అలవాటుకు బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. పదిరోజుల కిందట నజీం భార్య, కుమారుడితో కలిసి మహారాష్ట్ర శివుని గ్రామానికి మేస్త్రీ పనుల నిమిత్తం వెళ్లింది.
వక్రబుద్ధి చూపించిన అల్లుడు
వృద్ధురాలైన అత్త ఒక్కరే తన ఇంట్లో ఉంటున్నారు. అసలే మద్యానికి బానిసైన అల్లుడు నజీం తన వక్రబుద్ధిని చూపించాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చి అత్తను సైతం వేధించడం ప్రారంభించాడు. రెండు రోజుల క్రితం నజీం మద్యం మత్తులో ఉన్న నజీమ్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చింది.
లైంగిక దాడికి యత్నించిన అల్లుడి హత్య
సోమవారం అర్ధరాత్రి నజీం మరోసారి అత్తపై లైంగిక దాడికి యత్నించాడు. తన కోరిక తీర్చాలని బలవంతం చేయగా ప్రతిఘటించిన అత్త ఇంట్లో ఉన్న కర్రతో అతన్ని చితక్కొట్టింది. ఆపై గొంతు నులిమి ఆ కామాంధుడ్ని హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు ముథోల్ సీఐ మల్లేశ్, ఎస్సై బిట్ల పెర్సిస్‌లు తెలిపారు.





















