అన్వేషించండి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్ నియోజకవర్గం సస్యశ్యామలం చేయడానికి కుప్టి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు భట్టి విక్రమార్క.

కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది రాష్ట్ర ప్రజల బాగు కోసమా? సీఎం కెసిఆర్ కుటుంబం బాగుపడడానికా? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం దక్కుతుందని పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే.. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అగ్ని గుండంలో నెట్టివేసిన నేత సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సిరికొండ మండల కేంద్రంలో భట్టి విక్రమార్క తో కలిసి పాదయాత్రలో నడిచారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రజా సమస్యలను పరిష్కారానికి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రజలకు ఇండ్లు, పోడు పట్టాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు వర్తింపజేసి ఉపాధి హామీ పని కల్పించామని గుర్తుచేశారు. తెలంగాణ వస్తే మరిన్ని మంచి పథకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు ఉన్న పథకాలు తీసివేసి ప్రజలను గోసపెడుతున్న వ్యక్తి కేసిఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి అనేక మాయమాటలు చెప్పిన సీఎం కేసీఆర్ హౌజింగ్ శాఖను ఎత్తివేసి ప్రజలను దగా చేశారంటూ నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి  పోడు భూముల పట్టాలు పంపిణీ చేయకుండా గిరిజనులను వేధించి కేసులు పెట్టడానికేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందని సీఎం కేసీఆర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గిరిజన బిడ్డల బతుకులు బాగుకోసమే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. మీ కుటుంబం బాగుపడటానికి కాదు సీఎం కేసీఆర్ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో ఉన్న గ్రామాల్లో తొమ్మిదింటిని ఒక నియోజకవర్గంలో మిగతా గ్రామాలను మరొక నియోజకవర్గంలో కలపడం ఏంటి? ఒక మండలాన్ని రెండు నియోజకవర్గాలుగా విభజించడం ఇది తుగ్లక్ పాలన అని ఫైర్ అయ్యారు. కొత్తగా ఏర్పాటు చేసిన సిరికొండ మండలంలో ఆఫీసులు పెట్టకుండా పరిపాలన ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన చికుమన్ ప్రాజెక్టుకు కాలువలు తవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నదన్నారు. 

బోథ్ నియోజకవర్గం లోని మూడు నాలుగు మండలాలకు సాగునీరివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుప్టి ప్రాజెక్టు కట్టాలని ప్రతిపాదనలు తయారు చేశాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. మనకు సాగునీరు ఇవ్వని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మీ కొరకు పోరాటం చేయడానికి ఈ పాదయాత్ర మొదలుపెట్టానని భట్టి విక్రమార్క అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తామని అనడానికి మీరెవరు?. రాష్ట్ర సంపద ఏమైనా మీ అబ్బ సొత్తా? అంటూ బిఆర్ఎస్ నాయకుల బెదిరింపులపై మండిపడ్డారు సీఎల్పీ నేత. 5 లక్షల కోట్ల అప్పుచేసి ప్రజలపై భారము మోపిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే పాదయాత్ర మొదలుపెట్టానని చెప్పారు. తెలంగాణలో దొరల పాలన వద్దు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెసును గెలిపించుకొని పీపుల్స్ గవర్నమెంట్ తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్ నియోజకవర్గం సస్యశ్యామలం చేయడానికి కుప్టి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. చీకుమన్ ప్రాజెక్టు ఎత్తు పెంచి, గేట్లు ఏర్పాటు చేసి దిగువ  ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.సిరికొండలో షాదీఖాన నిర్మాణానికి హామీ ఇస్తున్న.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు. అడ్డగోలుగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget