అన్వేషించండి

Loan APP: 3వేలు ఇచ్చి ౩ లక్షలు వసూలు- చెల్లించకుంటే నగ్న ఫొటోలు వైరల్ చేస్తున్న లోన్ యాప్ నిర్వహాకులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లోన్ యాప్ వేధింపులు పెరిగిపోతున్నాయి. డబ్బులు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్‌ చేస్తున్నారు నిర్వాహకులు. వాటిని చూసి బాధితులు లబోదిబోమంటున్నారు.

కామారెడ్డి జిల్లాలో లోన్ యాప్‌ నిర్వాకులు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకొని కట్టని వారిపై ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజురోజుకు పెచ్చుమీరిపోతున్న వారి ఆగడాలను భరించలేకపోతున్నారు బాధితులు. లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని చెల్లించకపోవడంతో వసూళ్ల కోసం నిర్వాహకులు చేస్తున్న పనులు శ్రుతి మించిపోతున్నాయి. రుణగ్రస్తుల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. అసభ్యకరంగా మార్చేసి... ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో జరిగిన ఇలాంటి సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. లోన్ యాప్‌ బారిన పడ్డ బాధితుడు భరత్ కుమార్ అనే యువకుడు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన భరత్ కుమార్ అనే ఓ కాంటాక్ట్ ద్వారా యాప్ వచ్చింది. ఆ యాప్‌ను భరత్ కుమార్ ఓపెన్ చేసి వివరాలు ఫిల్ చేస్తే మూడు వేల రూపాయలు అకౌంట్లో వేశారు. 
ఆరు రోజుల తర్వాత భరత్‌ 3000లకు 6000 రూపాయలను రెట్టింపు చెల్లించాడు. ఇలా సుమారు రెండు లక్షల వరకు భరత్ కుమార్ లోన్ తీసుకొని పూర్తిగా చెల్లించగా మరో లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని మెసేజ్ పెట్టి వేధించారు. అంతేకాకుండా ఇష్టం వచ్చిన విధంగా ఆ యాప్ కు సంబంధించిన మహిళలు బూతులు తిడుతూ భరత్ కుమార్ ను వేధించారు. 

తిట్లతోపాటు భరత్ కుమార్ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆయనకు సంబంధించిన కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వారందరికీ వాట్సాప్‌ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భరత్ కుమార్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భరత్ కుమార్ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో సైతం ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయ్. అమాయకుల అవసరాలను క్యాష్ చేసుకుంటూ.... ప్రైవేట్ యాప్‌లు దోపిడీకి పాల్పడుతున్నారు. తీసుకున్న డబ్బులు ఒక్క రోజు లేట్‌గా చెల్లించినా... డబుల్ వడ్డీ వసూల్ కు పాల్పడుతున్నారు. బయటికి చెప్పుకోలేక చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ యాప్ వారు బాధితుల పూర్తి వివరాలను ట్రాక్ చేస్తూ... వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బులు కట్టని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ నగ్నంగా సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తున్నారు. దీంతో బాధితులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కొందరు మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ప్రయివేట్ యాప్ లను నిర్ములించాలని కోరుతున్నారు జిల్లా వాసులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Embed widget