By: ABP Desam | Updated at : 20 Dec 2022 07:00 PM (IST)
Edited By: jyothi
రేపటి నుంచి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీ - తొమ్మిది జిల్లాలో అమలు!
KCR Nutrition Kits: మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు (బుధవారం) నుంచి 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూట్రీషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వర్చువల్ మోడ్ లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఇదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
అయితే ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్ లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ములుగులో మంత్రి సత్యవతి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వికారాబాద్ జిల్లాలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డిలు కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు.
9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు
అత్యధికంగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అంచనాల ప్రకారం 1.25 లక్షల మంది గర్బిణులకు ఇది ఉపయోగపడనుంది. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రోటీన్స్, మినరల్స్, విటామిన్లలను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్‌కు రూ. 1962 తో రూపొందించి, కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పంపిణీ చేస్తున్నది.
న్యూట్రీషన్ కిట్లలో ఏమేం ఉంటాయంటే..?
రక్త హీనత (ఎనీమియా) గర్బిణుల పాలిట శాపంగా మారుతుంది. గర్బిణులకు ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసింది. ఈనెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నది. తొలిదశలో భాగంగా గర్బిణుల్లో ఎనీమియా ప్రభావం ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఏ జిల్లాలో ఎంత శాతం ఎనీమియా..?
గర్భిణులకు వరంగా ప్రభుత్వ చర్యలు..
మాతా శిశు సంరక్షణలో భాగంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని దేశంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు 13,90,634 మంది లబ్ధి దారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. రూ. 1261.61 కోట్లను ఆర్థిక సాయం కింద, డీబీటీ ద్వారా ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ కిట్ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇలా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి 30 శాతంగా ఉన్న ప్రసవాలు గణనీయంగా పెరిగి, ఇప్పుడు 66 శాతానికి చేరాయి. ఇదే సమయంలో అనవసర సి - సెక్షన్ల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తున్నది. ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు గర్బిణులకు వరంగా మారనున్నాయి.
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
/body>