హైకోర్టుకు చేరిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం- వ్యతిరేకిస్తూ పిల్ వేసిన రైతులు
గత కొన్ని రోజులుగా కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. తమ వ్యవసాయ భూములు ఇండస్ట్రియల్ జోన్ లో కావటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూ హైకోర్టుకు చేరింది. తమ ప్రమేయం లేకుండా తమ అనుమతి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్‌కు అనుమతులు ఇచ్చారని రైతులు కోర్టులో పిల్ వేశశారు. రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు తమ భూములను రిక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ వల్ల పట్టా భూములు కోల్పోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు కేసును సోమవారం విచారణ చేపట్టనున్నట్లు న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు.
గత కొన్ని రోజులుగా కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. తమ వ్యవసాయ భూములు ఇండస్ట్రియల్ జోన్ లో కావటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు కొనసాగిస్తున్నారు. భారీగా రైతులు తమ కుటుంబాలతో తరలి వచ్చి కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేశారు. రైతుల ఉద్యమానికి కాంగ్రెస్, బిజెపి నాయకులు సైతం మద్దతు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే ఒక రోజంతా రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. రైతులకు మద్దతుగా నిలిచారు. శుక్రవారం కామారెడ్డి పట్టణం బంద్ కు కూడా రైతులు పిలుపు నివ్వటంతో వ్యాపారులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బండి సంజయ్ సహా బిజెపి నేతలపై కేసులు
శుక్రవారం బండి సంజయ్ కామారెడ్డికి వచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రైతులతో సమావేశం అయ్యారు. తర్వాత భారీగా బిజెపి నాయకులు, రైతులతో కలిసి కలెక్టరేట్ కు వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టరేట్ ముట్టడి యత్నించటంతో దేవునిపల్లి పోలీసులు బిజెపి నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కామారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, దార్ల ఉదయ్ శంకర్, ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రకాష్, లక్ష్మీపతి, మనోజ్, ప్రదీప్ నేతతోపాటు మరి కొందరిపై కేసులు నమోదయ్యాయి.
రాత్రి రాములు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రైతుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకు కామారెడ్డి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చుకున్నారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రశాంతంగా ఉన్న కామారెడ్డి ఒక్కసారిగా భగ్గుమంది. పార్ట శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు పెట్టిన బారికేడ్లు తొలగించుకొని లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే కలెక్టర్ వచ్చి దీనిపై సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులతో సమావేశమైన శ్రీ @bandisanjay_bjp
— BJP Telangana (@BJP4Telangana) January 6, 2023
ఇండస్టియల్ జోన్ కు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన రైతులు
టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పట్ల రాక్షసంగా వ్యవహిరిస్తోందని రైతుల ఆగ్రహం pic.twitter.com/WutQZUQuVH
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి వెళ్లి రైతుల ఆందోళనలకు మద్దతు తెలపనున్నారు.