అన్వేషించండి

Kamareddy MLA: ప్రజా సమస్యల పరిష్కారానికి కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్నఆలోచన, ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు

Compalint Boxes: ఒకేఒక్కడు సినిమా తరహాలో కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల స్వీకరణకు నియోజకవర్గ వ్యాప్తంగా పెట్టెలు ఏర్పాటు

Innovative Governance: ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిపై పోటీచేసి దేశం మొత్తం తనవలైపు తిప్పుకునేలా చేసిన తెలంగాణలోని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Katipally Venkata Ramana Reddy) ప్రజలకు సేవలు అందించడంలోనూ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకే ఒక్కడు సినిమాలో సీఎం అర్జున్ ఏర్పాటు  చేసిన తరహాలో నియోజకవర్గ వ్యాప్తంగా ఫిర్యాదుల పెట్టే(Complaint Box)లు పెట్టిస్తున్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను చిట్టీపై రాసి ఆ పెట్టెలే వేస్తే నేరుగా తానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఫిర్యాదుల పెట్టెను స్వయంగా ఆయనే ఆరంభించారు.

ఫిర్యాదుల పెట్టె
శంకర్(Sankar) దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్(Arjun) నటించిన ఒకేఒక్కడు చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రంలో ఒకరోజు ముఖ్యమంత్రి(CM)గా పనిచేసిన అర్జున్ వినూత్న పాలనతో ప్రజల మనసు గెలుచుకుంటాడు. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు అధికారులు, పాలకుల వద్దకు వచ్చేందుకు బయపడుతున్నారని గ్రహించిన సీఎం వీధివీధిన ఫిర్యాదుల పెట్టె పెట్టిస్తాడు. ఏరోజు అయితే ఆ ఫిర్యాదుల పెట్టె ఖాళీగా దర్శనమిస్తుందో అప్పుడే తాను మంచి పాలన అందించినట్లు ప్రజలకు చెబుతాడు. మొదట్లో పెద్దఎత్తున ఫిర్యాదులు రాగా వాటిని సీఎం పరిష్కరించగా.... సినిమా ఎండింగ్‌కు వచ్చేసరికి ఆ ఫిర్యాదుల పెట్టె ఖాళీగా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి పథకానికే శ్రీకారం చుట్టాడు కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(Venkata Ramana Reddy ).  ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయించారు.కామారెడ్డిలో ఫిర్యాదు బాక్స్ ను ఆయన ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ఫిర్యాదులను పరిశీలించి తానే స్వయంగా వచ్చి పరిష్కరిస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు బాక్స్‌ల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు.

ఆదర్శ పాలన
నీతులు చెప్పడం సులభమే పాటించడం కష్టమంటారు.ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా..తమకు లాభం రాకపోయినా పర్వాలేదు గానీ నష్టం రాకుండా చూసుకుంటారు పాలకులు. ఇరుకుగా ఉన్న రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిలో కొంత భాగాన్ని ముందుగా ఆయనే స్వయంగా కూల్చివేసి ఆదర్శంగా నిలిచారు. వెయ్యి గజాలకు పైగా ఉన్న స్థలాన్ని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. దీని విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువగా ఉండే ఈ రోడ్డు విస్తరణ అత్యంత అవసరమని గుర్తించిన ఎమ్మెల్యే...విస్తరణ పనులు ముందుగా తన ఇంటి నుంచే ప్రారంభించారు. రోడ్డు విస్తరణ పనులు ఇంకా చేపట్టనప్పటికీ...భవిష్యత్ లోనూ ఎవరూ వేలెత్తి చూపకుండా ఆయనే ముందడుగు వేశారు. మిగిలిన వారు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. 
రికార్డు గెలుపు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలను ఢీకొట్టి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) స్వయంగా కామారెడ్డిలో పోటీ చేయగా... ఆయనపై పోటీకి సై అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం కాలుదువ్వారు. వీరిరువురి మధ్య వెంకటరమణారెడ్డి నిలుస్తాడా అన్న అనుమానాలు రేకెత్తాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అటు కేసీఆర్ ను, రేవంత్ రెడ్డిని వెనక్కి నెట్టి జయకేతనం ఎగురవేశారు. హేమాహేమీలు రంగంలోకి దిగినా...వందలకోట్లు డబ్బులు కురిపించినా...ఆయన గెలుపును ఆపలేకపోయారు. దీనికి కారణం ఆయన ప్రజలతో మమేకమ్యే తీరే...స్థానికంగా అందుబాటులో ఉంటాడని...ఎప్పుడు ఏ పనికి పిలిచినా వస్తాడని నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు పేరు ఉంది.చెప్పాడంటే చేస్తాడని ప్రతీతి. అందుకే కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాదనుకుని మరీ వెంకటరమణారెడ్డికి జనం పట్టం కట్టారు. అది నిలబెట్టుకునేందుకే ఆయన పాలనలో వినూత్న ఒరవడి సృష్టిస్తున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని భావించి ముందుగానే ఇంటిని కూల్చివేసినా... ఇప్పుడు ఫిర్యాదుల పెట్టే పెట్టించినా అది ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న సత్సంకల్పమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Kollywood: తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
Raghu Rama Krishna Raju Case: రఘురామకు టార్చర్ కేసులో మాజీ అధికారి విజయ్‌పాల్‌ అరెస్టు, నెక్ట్స్ ఏంటి?
Raghu Rama Krishna Raju Case: రఘురామకు టార్చర్ కేసులో మాజీ అధికారి విజయ్‌పాల్‌ అరెస్టు, నెక్ట్స్ ఏంటి?
Embed widget