TS: తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు - ప్రారంభించిన సీఎం కేసీఆర్
నూతనంగా నిర్మించిన ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ తరగతులను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. దేశ చరిత్రలో వర్చవల్‌గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీలలో విద్యా బోధన తరగతులను ప్రారంభించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చవల్‌గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీలలో విద్యా బోధన తరగతులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఒక్క విద్యా సంవత్సరం (2022-23)లోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి. వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు. వీటితోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 85 శాతం బీ కేటగిరీ మెడికల్ సీట్లను సైతం విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనంగా 1,068 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి.
జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే త్వరలో కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.
ఈ ఎనిమిది మెడికల్ కాలేజీల ప్రారంభంతో ఈ విద్యా సంవత్సరంలో 1150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. 2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఆ సంఖ్య 2091కి చేరింది. 2014లో 613 పీజీ సీట్లు ఉండగా 2022 నాటికి మొత్తం పీజీ గవర్నమెంట్ మెడికల్ సీట్ల సంఖ్య 1,249కి చేరింది. దీంతో రాష్ట్ర మెడికల్ విద్యార్ధులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
Also Read:
నిజాం కాలేజీ హాస్టల్ సీట్లకు దరఖాస్తులు, చెరి 50 శాతం సీట్లు కేటాయింపు!
నిజాం కాలేజీ హాస్టల్ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబరు 17 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. 50 శాతం చొప్పున యూజీ, పీజీ విద్యార్థినులకు సీట్లను కేటాయిస్తామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. నవంబరు 17 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నవంబరు 19న తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. సీట్లు కోరే విద్యార్థులు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..