Sankranti Special: సంక్రాంతి రద్దీలో ఇరుక్కోకుండా రైల్వే టిెకెట్స్ పొందడానికి ఈ ఆప్షన్లు కూడా ఉన్నాయి
Train Tickets More Easy Now: టికెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసి ఉండనే ఉంది. అయితే మరిన్ని ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ విధానాల్లో టికెట్లను తీసుకునే సౌకర్యాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Sankranti Special Trains Tickets : పట్టణాలన్నీ పల్లెవైపు చూస్తున్నాయి. సంక్రాంతికి మా ఊరెళ్లి చుట్టాలు, బంధువులతో హ్యాపీగా గడిపేద్దామని చాలామంది సొంతూళ్లకు బయల్దేరుతున్నారు. సెలవులు ఉన్నాయని కొందరు... సెలవులు పెట్టి మరీ మరికొందరు ఊరెళ్తున్నారు. అందుకే బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. నిలబడేందుకు కూడా ప్లేస్ ఉండటం లేదు. ఇలాంటి సమయంలో టికెట్ తీసుకోవాలంటే అంతా ఈజీ కాదు.
రద్దీతో తిప్పలు
ముఖ్యంగా ఫ్యామిలీతో బయల్దేరి వాళ్లు ఈ సమస్య ను ఎదుర్కొంటారు. అయితే ముందుస్తుగానే టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకు సమస్య ఉండకపోవచ్చు. అప్పటికప్పుడు జర్నీ ఫిక్స్ చేసుకున్న వాళ్లు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. అదే టైంలో ఫ్యామిలీని డ్రాప్ చేసే వాళ్లు కూడా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకోవడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరి కోసం ఆన్‌లైన్‌లో టికెట్ పొందే వెసులుబాటును రైల్వే శాఖ తీసుకొచ్చింది.
స్పెషల్ టికెట్ వెండింగ్ మెషిన్‌లు
టికెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసి ఉండనే ఉంది. అయితే మరిన్ని ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ విధానాల్లో టికెట్లను తీసుకునే సౌకర్యాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని వినియోగించుకొని ఈజీ ప్రయాణంతో హ్యాపీగా గమ్యం చేరాలని చెబుతోంది. దాదాపు అన్ని ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్‌లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా చేతులో డబ్బుల్లేకు మన బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు ఉంటే చాలు ఈ ఏటీవీఎం ద్వారా టికెట్ ఈజీగా పొంద వచ్చు.
చెల్లింపులు కూడా ఈజీయే
స్మార్ట్ కార్డు, లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఈ ఏటీవీఎం ద్వారా టికెట్లు పొందే వెసులుబాటు ఉంది. సాధారణ ప్రయాణ టికెట్లతోపాటు ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా తీసుకోవచ్చు. సీజనల్ టికెట్లను కూడా రెన్యూవల్ చేసుకోచ్చు. మెషిన్‌లో కనిపించే స్కీన్‌పై మొదట మనం జర్నీ స్టార్ట్ చేసే అంటే ట్రైన్ ఎక్కే స్టేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చేరాల్సిన స్టేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఏ క్లాస్ టికెట్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
2 నిమిషాల్లో టికెట్
అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత పేమెంట్ సెక్షన్‌కు వచ్చేసరికి యూపీఐ క్యూఆర్ కోడ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్మార్ట్ కార్డు రీడర్ వద్ద మన వద్ద ఉన్న కార్డు ఉంచితే పిన్ అడుగుతుంది. టైప్ చేస్తే టికెట్ వస్తుంది. లేదా అక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంచుకుంటే 110 సెకన్ల లోపు మనం కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ పూర్తైతే టికెట్ వస్తుంది.
యూటీఎస్ టికెట్ పొందడం మరింత ఈజీ
టికెట్ పొందడానికి ఉన్న మరో యాప్ యూటీఎస్. ఈ యాప్ ద్వారా జనరల్ అంటే అప్పటి వరకు టికెట్ రిజర్వ్ చేసుకోని వారంతా ఈ యాప్ ద్వారా టికెట్ పొందవచ్చు. అలాంటి వారు కౌంటర్ వద్ద క్యూ పాట్లు లేకుండా ఈజీగా ఇంటి వద్దే టికెట్లు తీసుకోవచ్చు. ఇక్కడ ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా పొందే వీలుంది. సీజనల్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు.
క్విక్ టిెకెట్ సౌకర్యం
యూటీఎస్ యాప్ మన ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇచ్చి పాస్ వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. డ్రాప్‌డౌన్ మెను నుంచి మనం జర్నీ స్టార్ చేయాల్సిన రైల్వే స్టేషన్, దిగాల్సిన రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేయాలి. తర్వాత మన వివరాలు పూర్తిగా ఇచ్చి చివరకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. యూపీఐ, ప్రీఛార్జ్, ఆర్ వేలెట్ లాంటి పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించి టికెట్ ఛార్జీలు చెల్లించవచ్చు. రెగ్యులర్‌గా ప్రయాణం చేసేవాళ్ల కోసం ఇందులో క్విక్ టికెట్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది.