అన్వేషించండి

Shakeel News: నా కొడుకును తెలంగాణ పోలీసులు చంపుతారట, సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిందే - బోధన్ మాజీ ఎమ్మెల్యే

Telangana News: తన కుమారుడు నిజంగా తప్పు చేసి ఉంటే.. ఒకవేళ ఉరి వేసినా తనకు అభ్యంతరం లేదని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ అన్నారు. తాను ప్రస్తుతం దుబాయ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు.

Bodhan Ex MLA Shakeel: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ చాలా కాలం తర్వాత ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమారుడు ఓ కారు ప్రమాదంలో ఇరుక్కోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షకీల్ ఇప్పుడు ఓ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోను ఆయన దుబాయ్ నుంచే చేసినట్లుగా తెలిసింది. తన కొడుకును జైల్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని షకీల్ అన్నారు. పోలీసులు కూడా నా కొడుకును చంపేస్తామని అంటున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో తన కొడుకును ఇరికించారని షకీల్ ఆవేదన చెందారు. పంజాగుట్ట కారు ప్రమాదం వ్యవహారంలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజకీయంగా విభేదాలుంటే మనం మనం చూసుకుందామని.. ఇందులోకి పిల్లలను లాగవద్దని సూచించారు. రాజకీయ శత్రుత్వంలోకి పిల్లలను జోక్యం చేయొద్దని సూచించారు.

తన కుమారుడు నిజంగా తప్పు చేసి ఉంటే.. అందుకు తగ్గ శిక్షలు ఉన్నాయని.. ఒకవేళ ఉరి వేసినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. అన్ని టీవీలు, పత్రికల్లో తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తన కుమారుడికి ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని.. తనకు పోలీసులపై అసలు నమ్మకం లేదని షకీల్ అన్నారు. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నానని.. దుబాయ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు.

తన 21 ఏళ్ల కుమారుడిని ఘటన జరిగిన తర్వాత అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. రోజాలో ఉన్న పిల్లాడ్ని 20 గంటల పాటు ఇన్వెస్టిగేషన్ చేశారని.. శారీరకంగా, మానసికంగా వేధించారని అన్నారు. అక్రమ కేసులు బనాయించి.. ఎన్ కౌంటర్ జరిపిస్తామని బెదిరిస్తున్నారని షకీల్ ఆరోపించారు. డీసీపీ వెస్ట్ జోన్, జూబ్లీహిల్స్ పోలీసులు, పంజాగుట్ట సీఐ తదితర పోలీసులు బాధ్యత వహించాలని అన్నారు.

షకీల్ కుమారుడు రహీల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. రహీల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలు, ఇద్దరి ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అతనికి సూచించింది.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget