అన్వేషించండి
Advertisement
Dande Vithal: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట, హైకోర్టు తీర్పుపై స్టే
Telangana BRS News: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పివ్వగా.. ఆ తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే ఇచ్చింది.
Supreme Court onBRS MLC Dande Vithal | న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు (మే 17న) స్టే ఇచ్చింది. ఎమ్మెల్సీ విఠల్ పిటిషన్ తదుపరి విచారణను కోర్టు జులైకి వాయిదా వేసింది.
అనర్హత వేటు వేసిన హైకోర్టు!
ఆదిలాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి బీఆర్ఎస్ నేత దండె విఠల్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే విఠల్ ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు షాకిచ్చింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిన కోర్టు, ఆయనకు రూ.50,000 జరిమానా సైతం విధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
క్రైమ్
తెలంగాణ
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion