అన్వేషించండి

Tiger News: నిర్మల్ జిల్లాలో టెన్షన్ టెన్షన్ - పెద్దపులి, చిరుతపులి సంచారంతో వణికిపోతున్న ప్రజలు

Nirmal New నిర్మల్ జిల్లాలో అటు పెద్దపులి, ఇటు చిరుతపులి సంచారంతో సారంగాపూర్ మండలం ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో చిరుత దాడి చేస్తుందా, లేక పెద్దపులి చంపుతుందా అని భయపడుతున్నారు.

Cheetah In Nirmal District | సారంగాపూర్: నిర్మల్ జిల్లా ప్రజలను పెద్దపులి, చిరుతపులి హడలెత్తిస్తున్నాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిధిలోని అటవి ప్రాంతంలో చిరుత పులితో పాటు ఓ పెద్దపులి (Bengal Tiger) సంచరిస్తోంది. మూడు రోజులక కిందట బోథ్ మండలంలోని వజ్జర్ అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి మరుసటి రోజు తిరిగి సారంగాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వెళ్ళింది. 

తాజాగా సారంగాపూర్ మండలంలోని, అడెల్లితాండ, రవీంద్రనగర్ తండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మేకలను మేపేందుకు అడవికి భువనగిరి సాయినాథ్ అనే యువకుడు వెళ్లగా.. మేస్తున్న మేకలు ఒక్కసారిగా బెదిరిపోవడంతో అనుమానం వచ్చి చూడగా మేకల మంద వైపు పెద్దపులి రావడానికి గమనించి ఒక్కసారిగా అతడు చెట్టుపైకి ఎక్కాడు. పెద్దపులి దాడి చేసేందుకు దగ్గరికి వస్తుండగా అతడు ఒక్కసారిగా కేకలు వేశాడు, చెట్టుపై నుండే పెద్దపులి సెల్ ఫోన్ లో వీడియోను చిత్రీకరిస్తూ పెద్దగా కేకలు వేశాడు. దీంతో పెద్దపులి మేకల మందపై దాడి చేసి రెండు మేకలను చంపింది. మరో మేకపై దాడి చేసి గాయపరిచింది. విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా గ్రామస్తులు కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ బాధితుడు సాయినాథ్ వద్దకు వచ్చారు. అప్పటికే పెద్దపులి అడవిలోకి వెళ్ళిపోయింది. 

Tiger News: నిర్మల్ జిల్లాలో టెన్షన్ టెన్షన్ - పెద్దపులి, చిరుతపులి సంచారంతో వణికిపోతున్న ప్రజలు

మూడు, నాలుగు రోజులుగా పెద్దపులి, చిరుత పులి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కనిపించినట్లు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు అడవికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అలర్ట్ గా ఉండాలని సమీప గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై నిర్మల్ అటవీ రేంజ్ అధికారి రామకృష్ణను ఏబిపీ దేశం ఫోన్ ద్వారా సంప్రదించగా.. బోథ్ వైపు నుండి వచ్చిన పెద్దపులి సారంగాపూర్ రేంజ్ పరిధిలో తిరుగుతోందని చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతపులులు చాలా ఉన్నాయని, పెద్ద పులులు సైతం తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి మహారాష్ట్రను అనుకొని ఇటువైపుగా వస్తూ పోతూ ఉంటాయన్నారు. సమీప గ్రామాల ప్రజలు పులి సంచారం ఉన్నందున అడవుల్లోకి వెళ్ళద్దని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులులకు ఎవరు ఎలాంటి హాని చేయకూడదని చెబుతున్నారు. వ్యవసాయ పొలాల్లో అడవిపందులకు అమర్చే విద్యుత్ తీగలను తొలగించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. 
అటవీశాఖ పరిహారం అందిస్తుందన్న అధికారులు
పులి దాడిలో ఎవరి పశువులైనా గాయపడినా, మరణించినా దానికి పరిహారం అటవీశాఖ తరఫున అందిస్తామని ఎవరు ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే బాధితుడు సాయినాథ్ మాట్లాడుతూ... మేకలను మేతకు తోలుకొని వెళ్ళినప్పుడు మేకలు బెదిరిపోయాయి. ఏంటి అని పరిశీలించగా పెద్దపులి కనిపించిందని భయంతో చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నానని పెద్దపులి తన దాడికి ముందుకూ వస్తుండగా కేకలు వేస్తూ వీడియో చిత్రీకరించానని, దీంతో పెద్దపులి మేకలమందపై దాడి చేసి రెండు మేకలను తిని మరో మేకను గాయపరిచి అడవిలోకి లాక్కెళ్లిపోయిందని తెలిపాడు.
మరోవైపు చిరుత పులి ఒక ఆవు ఒక మేకపై దాడి చేసి గాయపరచడంతో పెద్దపులి చిరుతపులి సంచారం విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు వాటికి హాని తలపెట్టవద్దని ఏవైనా మేకలు పశువులను చంపితే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని వాటికి హాని తలపెట్టవద్దని గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికైనా ఎలాంటి  అనుమానం కలిగినా పులి సమాచారం తెలిసిన తమకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.

Also Read: ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget