Adilabad Latest News: ప్రైవేటు హైర్ బస్ డ్రైవర్ల ఆందోళన - ఆర్టీసీ ఉద్యోగ నియామకాల్లో 30% వెయిటేజ్ కోసం డిమాండ్
Adilabad Latest News: ఆర్టీసీ కష్టనష్టాల్లో ఉన్న హైర్ బస్ డ్రైవర్లకు ఇప్పుడు జరుగుతున్న టీజీఎస్‌ఆర్టీసీ నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Adilabad Latest News: ఆర్టీసీలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు డ్రైవర్లు,శ్రామిక్, ఇతర క్యాటగిరిలా వారిగా ఉద్యోగులు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లకు, ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు 30% వెయిటేజ్ ఇవ్వాలని ఏఐటీయూసీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ కి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినపత్రం అందజేశారు.
వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఏఐటీయూసి అధ్యక్షుడు టి.దివాకర్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ఆర్టీసీ సంస్థకు లాభాలు రావడంలోనూ ఆర్టీసీ సంస్థ అభివృద్ధి చెందడంలోనూ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇతర డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టేటప్పుడు వేయిటేజ్ మార్కులు ఇస్తారని, అలాగే ఆర్టీసీలో కూడా 30% మార్కుల నుంచి మొదటి ప్రాధాన్యత వీరికే ఇవ్వాలన్నారు. చాలిచాలని జీతాలతో పనిచేస్తున్న హైర్ బస్ డ్రైవర్లకు మొదటి ప్రాధాన్యత కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి ఉపేందర్, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఆసిఫాబాద్(AITUC)డిపో అధ్యక్షుడు మాధుసూధన్, ఉపాధ్యక్షుడు భాస్కర్, నాయకులు పాల్గొన్నారు.






















