అన్వేషించండి

Adilabad News: మార్కెట్ లో ధర లేదు, ఇంట్లో స్థలం లేదు -  పత్తి ఏం చేయాలో తెలియక రైతుల ఇబ్బందులు

Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ లో గిట్టుబాటు ధర లేక పంట పెట్టుకునేందుకు ఇంట్లో స్థలం లేక నానా అవస్థలు పడుతున్నారు. 

Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇళ్లలోనే పత్తి పంటను నిల్వ చేసుకుంటున్నారు. దీంతో వైట్ గోల్డ్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆదిలాబాద్ పత్తి మార్కెట్ ఎప్పుడూ లేని విధంగా పత్తి నిల్వలు లేక బోసిపోతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పూర్తి స్థాయిలో అమ్మకాలు నిలిపివేశారు. పూట గడవడం కష్టంగా ఉన్నా.. అన్నదాతలు మాత్రమే దిక్కుతోచని స్థితిలో పంటను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులంతా ధరలు పెరుగుతాయనే గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో పంటను అమ్మడానికి ఏమాత్రం ముందుకు రావడం లేదు. మార్చి నెల వచ్చిన కనీస కొనుగోళ్లు కాకపోవడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై ఏబీపీ దేశం స్పెషల్ రిపోర్ట్.

ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులు అరిగోస పడుతున్నారు. రైతులు కష్టపడి పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక పంటను ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. నవంబర్ - డిసెంబర్ నెలలో మార్కెట్ ధర క్వింటాల్ కు రూ.9000 మధ్య ఉండేది. జనవరి నుండి మార్కెట్ ధర తగ్గుముఖం పడుతూ ఫిబ్రవరి, మార్చి నెలలో కనీస ధర రూ.6.380 కాగా.. మార్కెట్ ధర రూ.7,600గా ఉంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో పత్తి పంట ఆలస్యంగా వచ్చింది. అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో పంట ముందుగానే చేతికి వచ్చినప్పటికీ.. కొనుగోళ్ల సమయంలో ముందున్న మార్కెట్ ధరకు అంతగా రైతుల పంటలు చేతికందలేదు. ఇప్పుడిప్పుడే కొంత మంది రైతుల పంటలు చేతికొచ్చాయి. సేకరించిన పత్తిని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మాలంటే ముందున్న ధర లేదు. రెండు వేల రూపాయల తేడా ఉంది. దీంతో రైతులు పత్తిని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. దీంతో ఆసియాలోనే అతిపెద్ద పత్తి మార్కెట్ గా పేరున్న ఆదిలాబాద్ పత్తి మార్కెట్ పత్తి నిల్వలు లేకుండా బోసిపోతోంది. ఎప్పుడూ లేని విధంగా స్పిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులు పత్తి నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుత సమయంలో నిత్యం పత్తి వాహనాల భారీ క్యూలతో, రైతులు, వ్యాపారుల హడావిడితో రద్దీగా ఉండాల్సిన ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి.

దిగుబడి ఉన్నా ధర లేని పరిస్థితి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు కాగా.. నవంబర్ లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అప్పటి మార్కెట్ ధర క్వింటాల్ కి రూ.9.000 ఉంది. అయితే కొంతమంది రైతులకు చేతికొచ్చిన పంటను మాత్రం అమ్ముకోగా.. నెల రోజుల తరువాత మిగిలిన రైతుల పంట చేతికొచ్చింది. కానీ ధర అంతగా లేదు. ప్రస్తుతం రూ.7,600 మధ్య ఉంది. మార్కెట్ లో కొనుగోళ్ల విషయంలో ఇప్పటి వరకు 40 శాతానికి మించి కొనుగోలు జరగకపోవడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. గతేడాది ఫిబ్రవరి - మార్చి నెలలో 90 శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తికాగా ఈ ఏడాది మార్చి నెల నాటికి ఇప్పటికి అంతగా కొనుగోళ్లు జరగ లేదు. గత రెండు సంవత్సరాలుగా వాతావరణ పరిస్థితులు, కాయకుళ్లు తెగులు కారణంగా పత్తిపంటలో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దాదాపుగా ప్రతి రైతుకు 3 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. కానీ ఈ సంవత్సరం జిల్లాలో పత్తి పంటకు వాతావరణం అనుకూలించడంతో పాటు ఎలాంటి తెగుళ్లు రాకపోవడంతో మంచి దిగుబడిని పొందారు రైతులు. జిల్లా వ్యాప్తంగా సరాసరిగా ఎకరానికి 5 నుండి 8 క్వింటాళ్ల దిగుబడిని సాధించారు. దీంతో అక్టోబర్ నెల నుండే పెద్ద మొత్తంలో పత్తి పంట మార్కెట్ కు తరలివస్తుందని అందరూ ఊహించారు. కానీ సీజన్ చివర్లో కనీస కొనుగోలు జరగని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లుగా సరైన దిగుబడి పొందని రైతులు పంటను అమ్ముకున్న తరువాత పత్తి ధరలు భారీగా పెరిగాయి.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన

ఈ ఏడాది మంచి దిగుబడిని సాధించిన రైతులు ఎక్కువ ధరకు పంటను అమ్మేందుకు నిర్ణయించుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 7వేల చిల్లర ధర మాత్రమే ఉండగా.. గత రెండు సంవత్సారాలలో సీజన్ ఆఖరికి అంటే రైతులు పూర్తిగా పంటను అమ్ముకున్న తరువాత 10 వేలకు పైగా ధర పెరగడంతో ఈ ఏడాది పంటను అమ్మేందుకు రైతులు తొందరపడటం లేదు. ఖర్చులు, అవసరాలకు అనుగుణంగా 2 , 3 క్వింటాళ్లకు మించి దాదాపుగా ఏ రైతు పంటను అమ్ముకోవడం లేదు. దీంతో మార్కెట్ మరియు జిన్నింగ్ మిల్లులు సైతం రద్దీ లేకుండా కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అంతగా పత్తి రాలేదని వ్యాపారులు సైతం చెబుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దత్తు ధర పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదని, చివరికి రైతు ధర పెరుగుదల కోసం వేచి చూస్తూ విసుగు చెంది గత్యంతరం లేక తక్కువ ధరకే పంటను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. గత రెండు సంవత్సరాలు పంట రైతుల వద్ద నుండి వ్యాపారుల వద్దకు చేరిన తరువాత ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు ఆగిపోయిన పరిస్థితిలో కూడ ఇతర దేశాల నుండి పత్తి దిగుమతులు చేపడుతున్నారని బయటి దేశాల నుండి దిగుమతులు ఆపేస్తే స్థానికంగా డిమాండ్ పెరిగి, ధరలు పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.

ఈ ఏడాది సీజన్ ఆరంభంలో పత్తిపంట ధర ఆశాజనకంగా కనిపించినా తరువాత క్రమంగా ధర పతనం అవుతూ వచ్చింది. అంతర్జాతీయ విపణిలో డిమాండ్ తగ్గటం, బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ నిలిచిపోవడంతో పత్తి బేళ్ల ధర గణనీయంగా తగ్గింది. విత్తనం నుండి వేరు చేసిన 170 కిలోల దూదిని ప్రెస్ చేసి ఒక బేల్ గా మారుస్తారు. అలాంటి ఒక పత్తి బేళ్ ధరతో పాటు పత్తి విత్తనాల ధర పత్తి పంట ధరను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఒక పత్తి బేళ్ ధర 60 నుండి 65 వేల వరకు ఉండగా.. ఒకవేల ఒక పత్తి బేళ్ ధర 70 నుండి 80 వేల వరకు పలికితే 8 వేల పై చిలుకు ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పత్తి కొనుగోలుకు సంబంధించిన సీజన్ గా పరిగణిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులతో ఫిబ్రవరి నుండి జూన్ వరకు సీజన్ రూపాంతరం చెందిందని భావిస్తున్నారు. పత్తి కోనుగోలుకు సంబంధించిన సీజన్ తోనే ఇతర వ్యాపారాలు సైతం ఆధారపడి ఉంటాయి. పత్తి అమ్మకాలు అంతంత మాత్రమే ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాల వరకు వ్యాపారాలు సైతం పడిపోయాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు మార్కెట్ లో ధర లేక ఇళ్లలోనే పత్తి నిల్వలు చేసుకోగా.. కొన్ని చోట్ల ప్రమాదవశాత్తు పత్తికి నిప్పంటుకొని నష్టపోయారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం రాసపల్లి గ్రామానికి చెందిన పెరిక సంతోష్ అనే రైతు కష్టపడి సాగు చేసిన పత్తిపంటను ధర లేక ఇంట్లో నిల్వ చేసుకున్నాడు. ధర పెరిగితే పంటను అమ్ముకోవచ్చని భావించిన అతనికి ఊహించని నష్టం కలిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఇంట్లో ఉన్న 120 క్వింటాళ్ల పత్తితో పాటు 24 క్వింటాళ్ల వడ్లు మంటలో కాలిపోయాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేశారు. అందులో కొంత మాత్రమే పత్తి మిగిలి ఉంది. కష్టపడి పండించిన పంట కాలిపోవడంతో రైతు సంతోష్ ఆవేదనతో కుమిలిపోయాడు. చల్లారిన తరువాత మిగిలిన పత్తిని ఎండలో ఎండబెడుతు కాలిన పత్తి నుండి వేరు చేస్తూ ఎంతో కొంత అమ్ముకోవచ్చని ఆశతో పత్తిని వేరు చేస్తున్నాడు. తనకు జరిగిన విధంగా ఎవరికి నష్టం జరగవద్దని కోరుతున్నాడు. అలాగే మంచిర్యాల జిల్లాలోని నెన్నెల్‌ మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు ధర లేక ఇంట్లో పత్తి నిల్వ చేసుకోగా.. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 30 క్వింటాళ్ల పత్తి పంట మంటల్లో కాలిపోయింది. ఇలా రైతులు ఇళ్లలోనూ నిల్వ చేసుకుంటున్న దురదృష్టవశాత్తూ నిప్పంటుకొని రైతులు నష్టపోతున్నారు. ఇంట్లో పడుకోవడానికి చోటు లేక ఆరుబయటే పడుకుంటున్నారు. వడ్డీలు తెచ్చి సాగు చేస్తే ధర లేక మరికొందరు రైతులు అలా నష్టపోతున్నారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇళ్లలో పత్తి నిల్వలు లేకుండా మార్కెట్ లొ మంచి ధర వచ్చెలా తోడ్పడాలని కోరుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
YS Jagan News: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్ల పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్ల పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
BJP Vishnu:  వైసీపీ గతే తెలంగాణ కాంగ్రెస్‌కు -  పార్టీ ఆఫీసులపై దాడులపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హెచ్చరిక
వైసీపీ గతే తెలంగాణ కాంగ్రెస్‌కు - పార్టీ ఆఫీసులపై దాడులపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హెచ్చరిక
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Embed widget