News
News
X

kamareddy News: నాలుగు వందల ఇళ్లు ఉన్న గ్రామానికి ఒకటే బోరు, ప్రజలను కదిలిస్తే ఆగదు కన్నీరు

మూడు భాషల సంగమం ఆ గ్రామం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర బోర్డర్ వద్ద ఉంది సోపూర్ గ్రామం. తెలంగాణ పరిధిలో వచ్చే సోపూర్ గ్రామంలో 3 భాషలు మాట్లాడుతారు. అభివృద్ధికి దూరంగా సోపూర్ గ్రామం

FOLLOW US: 

చుట్టూ ప్రకృతి సోయగం, ఎత్తైన ప్రదేశంలో కనిపించే గ్రామం సోపూర్. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ బోర్డర్‌లో ఉంది. ఈ అరుదైన భౌతిక లక్షణమే ఈ గ్రామానికి శాపంగా మారింది. అక్కడ ఓ గ్రామం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అభివృద్ధి అంటే తెలియని పల్లెటూరుగా మిగిలిపోయింది. 

తెలంగాణ పరిధిలో ఉండే సోపూర్ గ్రామంలో మూడు భాషలు మాట్లాడతారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మధ్య జీవనం సాగిస్తున్నారు ఈ గ్రామస్తులు. చాలా వెనుగబడిన గ్రామం ఇది. సోపూర్‌లో తెలుగు మీడియం స్కూల్ ఐదో తరగతి వరకే ఉంది. తెలుగు మీడియంలోనే పాఠాలు చెప్తారు. కానీ ఇక్కడి వాళ్లకు ఆ పాఠాలు బుర్రకెక్కవు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభావం ఎక్కువగా ఉన్న వీళ్లకు తెలుగు చదవడం పూర్తిగా రాదు.

కనీసం ప్రాథమిక చదువే సాగని ఆ ఊరిలో ఉన్నత చదువుల మాటే వినిపించదు. అర్థం కాని చదువులు చదవలేక చాలా మంది చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. అక్షరాలు దిద్దాల్సిన చేతులతో పనికి వెళ్తున్నారు. 

కేవలం వ్యవసాయంపైనే అధారపడి జీవించే సోపూర్ గ్రామ ప్రజలు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు.  ఇక్కడ పత్తి, తొగర్లు పండిస్తారు. వాటిపైనే జీవనం సాగిస్తారు. గ్రామంలో దాదాపు 400 ఇళ్లు ఉంటాయి. 1000 వరకూ జనాభా ఉంటుంది. కనీస వసతులు మాత్రం మచ్చుకైనా కనిపించవు. గ్రామం మొత్తానికి ఒకే  బోరు ఉంటుంది. అక్కడికి వెళ్లే తాగు నీరు ఇతర అవసరాలకు వాడుకుంటారు.

వీధి లైట్లు కూడా సరిగా ఉండవు. నాలాలు లేవు. ప్రజలు ఇంకా అనాగరిక జీవితాన్ని గడుపుతున్నారు. విభిన్న సంస్కృతుల మధ్య వీరి జీవనం సాగుతోంది. బోర్డర్‌లో ఉన్న ఈ గ్రామంలో కనీసం హెల్త్ సెంటర్ కూడా లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే జుక్కల్ మండలం కేంద్రానికి వెళ్లాల్సిందే. రోగులను తీసుకెళ్లేందుకు కూడా రవాణా సౌకర్యం లేదు. అర్థరాత్రి ఏదైనా ఆపద వస్తే రాత్రంతా ఊరిలో జాగారం చేయాల్సిందే. తెల్లవారితేనే ఊరి నుంచి బయటపడి వైద్యుడికి చూపిస్తారు. ఇలాంటి దుస్థితిలో గర్భిణులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఆ ఊరికి వచ్చేది ఒకే ఒక్క టీఎస్‌ఆర్టీసీ బస్సు. అది కూడా స్కూల్స్‌ తెరిచి ఉన్నప్పుడే వస్తుంది. స్కూల్స‌్‌కు సెలవులు ఇస్తే బస్సుకు కూడా సెలవులే. ఆ టైంలో ఇక్కడి ప్రజలు వేరే ప్రత్యామ్నాయాల్లో ప్రయాణాలు సాగిస్తుంటారు. కర్ణాటక నుంచే వచ్చే రెండు బస్సులే వీళ్లకు దిక్కు. దానికి కూడా టైమింగ్స్ ఉండవు.  

ఈ గ్రామం తెలంగాణ బోర్డర్ లో విసిరేసినట్లుగా ఉండటంతో పాలకులు సైతం ఈ గ్రామాన్ని పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయ్. గ్రామంలో కనీసం సీసీ రోడ్లు కూడా లేవు. వర్షాకాలం వస్తే అనేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నారు.

Published at : 08 Feb 2022 04:51 PM (IST) Tags: Kamareddy Kamareddy News Kamareddy News Update Kamareddy Latest News

సంబంధిత కథనాలు

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

టాప్ స్టోరీస్

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?