By: ABP Desam | Updated at : 13 Mar 2023 02:59 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఆసుపత్రిలో ఎమ్మెల్యే హల్ చల్
Nizamabad News : ఇటీవల ఓ ఆసుపత్రిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రవర్తన వివాదస్పదంగా మారింది. సమస్యలను సద్దుమణిగేలా చేయాల్సిన ఎమ్మెల్యే ఆసుపత్రి సిబ్బంది చెంప చెల్లుమనిపించారు. సర్దిచెప్పడానికి ప్రయత్నించిన పోలీసు అధికారిని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆస్పత్రి సిబ్బంది పై చేయి చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలోని ఎం.ఆర్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయిన సీసీ కెమెరా వీడియో ఫుటేజీలు వైరల్ అయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన జ్యోతి అనే పేషెంట్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి మండిపడ్డాడు. మహిళా రోగి విషయంలో ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే జాజుల సురేందర్ చేయి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగింది?
ఓ మహిళా రోగి విషయంలో ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జాజుల సురేందర్ చేయి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన జ్యోతి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె నిజామాబాద్ ఖలీల్‌వాడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. హోలీ రోజున రాత్రి 10 గంటల సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఐసీయూలో ఉన్న జ్యోతి అపస్మారక స్థితికి వెళ్లినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు వైద్యుల చికిత్స తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు సడన్ గా క్షీణించిందని చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నచ్చిన ఆసుపత్రికి తీసుకువెళ్లండని వైద్యులు చెప్పడంతో బాధిత కుటుంబం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌కు ఫోన్‌చేసి విషయం తెలిపారు. పార్టీ కార్యకర్త భార్య జ్యోతి పరిస్థితిపై ఎమ్మెల్యే అప్పటికే వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారని బాధితులు ఎమ్మెల్యేకు చెప్పటంతో రాత్రి 11 గంటల తర్వాత ఆసుపత్రికి వచ్చిన ఆయన.. జ్యోతికి అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. ఈ సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి తనను నర్సింగ్ ఇన్‌ఛార్జ్ గా పరిచయం చేసుకున్నాడు. వైద్యుడిని పిలిపించమని ఎమ్మెల్యే చెప్పగా ఆ సమయంలో అతడు స్పందించిన తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అతడిపై చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా అతడిపై దాడి చేశారు. కాసేపటి తర్వాత వైద్యులు వచ్చి రోగిని డిశ్చార్చ్ చేశారు. ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
మద్యం తాగి నిర్లక్ష్య సమాధానం
ఖలీల్ వాడి ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఘటనపై కేసు పెట్టవద్దని ఆసుపత్రి యజమాని, సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే కోపంతో చేయి చేసుకున్నారని, తాము రాజీపడ్డామని తెలిపారు. అయితే ఎమ్మెల్యే చేయి చేసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ ... ఆసుపత్రి నిర్వాహకులు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఫోన్ చేస్తే వచ్చానని చెప్తే ఆసుపత్రికి వచ్చానన్నారు. ఆ సమయంలో టీషర్ట్ ధరించి రంగులు పూసుకొని ఓ వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, అతడు ఐసీయూ ఇన్‌ఛార్జ్ అని చెప్పాడన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగితే అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని ఎమ్మెల్యే అన్నారు. ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన చికిత్సకు వైద్యులు లేరని, సరైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పి నెట్టుకొచ్చారన్నా ఆరోపించారు. రోగి పరిస్థితి విషమించడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని ఒత్తిడి చేసినట్లు బాధితులు చెప్పడంతో కోపంలో చేయిచేసుకున్నట్లు తెలిపారు.
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా