By: ABP Desam | Updated at : 28 Nov 2022 09:41 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
అడెల్లి పోచమ్మ దేవాలయంలో బండి సంజయ్
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లాలో ప్రారంభం అయింది. జిల్లాలోని అడెల్లి పోచమ్మ ఆలయం నుంచి 5వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర"ను లాంఛనంగా ప్రారంభించారు బండి సంజయ్. పాదయాత్రకు హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. ప్రజాసంగ్రామ యాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్‌కు వెళ్లిన బండి సంజయ్ అడెల్లి పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడెల్లి పోచమ్మ తల్లి దేవాలయం నుంచి సారంగపూర్ వరకు 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ రాత్రికి గుండెగాంలో బండి సంజయ్ బస చేశారు. రేపు భైంసాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
మారిన సభావేదిక
బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. భైంసా వెళ్లకూడదని, బహిరంగ సభను భైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని ఆదేశించింది. పాదయాత్రలో 500 మందికి, సభలో 3 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే బహిరంగ సభ నిర్వహించాలని తెలిపింది. పాదయాత్ర, సభల్లో ఇతర మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. అలాగే కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనలతో బీజేపీ బహిరంగ సభాస్థలిని మార్చింది. సభావేదికను భైంసాకు మూడు కిలోమీటర్ల అవతల ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కుంటిసాకులతో అడ్డుకోలేరు- బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని బండి సంజయ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ముందు సభ నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చి ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించామన్నారు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా పాదయాత్రను కొనసాగించామన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించిందన్నారు. అందుకే హైకోర్టుకు వెళ్లామన్నారు. పాదయాత్రకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.
భైంసా ప్రజల నుంచి బండి సంజయ్ ను దూరం చేయలేరు
"కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తాం. ఈరోజే నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళుతున్నా. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తాం. అక్కడి నుంచే లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తాం. భైంసాను బండి సంజయ్ కు దూరం చేశారేమో.. కానీ భైంసా ప్రజల నుంచి బండి సంజయ్ ను దూరం చేయలేరు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుంచి భైంసా ప్రజలను వేరు చేయలేరు. భైంసాకు అసలు ఎందుకు వెళ్లకూడదు? వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? భైంసా ఈ దేశంలో లేదా? అసలు భైంసాలో అల్లర్లు సృష్టించింది ఎవరు? ఆ అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నదెవరు? భైంసాలో అమయాకుల ఉసురు తీసిందెవరు? కేసులు పెట్టి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? మేం భైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసింది." - బండి సంజయ్
Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు
Eatala Rajender: టిఫిన్ చెయ్యడానికి అసెంబ్లీలో స్థలమే లేదు - ఈటల, మంత్రుల కౌంటర్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్‌లో మరో దారుణం!
Breaking News Live Telugu Updates: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?