అన్వేషించండి

Telangana Railway Line: తెలంగాణలో కొత్త రైల్వే లైన్ - ఆ 2 నగరాలకు తగ్గనున్న ప్రయాణ సమయం

Telangana News: తెలంగాణలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Telangana New Railway Line: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినందున హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. ఖమ్మం జిల్లా మోటుమర్రి, నల్గొండ జిల్లా విష్ణుపురం మధ్య రైల్వే రెండో లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు రైళ్లు తక్కువ సమయంలోనే చేరుకునే వెసులుబాటు కలగనుంది. 88.81 కి.మీ రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి రూ.1,746.40 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకు గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో రెండో రైలు మార్గాన్ని నిర్మించి ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించాలని కేంద్రం నిర్ణయించింది.

టైం సేవ్

ఇప్పటివరకూ ప్రయాణికులు కొన్ని రైళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి గుంటూరు వెళ్లి విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. సికింద్రాబాద్ నుంచి 313 కి.మీలు దూరం ఉండగా.. బీబీనగర్ - గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండడంతో ప్రయాణికులు రైలులో ప్రయాణించాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అయితే, మోటుమర్రి మార్గంలో రెండో లైన్ ఏర్పాటు చేస్తే గుంటూరు వెళ్లకుండా నేరుగా విజయవాడ చేరుకోవచ్చు. ఈ మార్గం ద్వారా దాదాపు 50 కి.మీ దూరం తగ్గించి గంట సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. 2011లో సిమెంట్ పరిశ్రమల వాణిజ్య అవసరాల కోసం విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకూ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 24 గూడ్స్ రైళ్లు నడుపుతూ.. సిమెంట్, ఇనుము, బియ్యం రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకే మార్గంలో ఇన్ని గూడ్స్ ట్రైన్లు నడుస్తుండగా.. ట్రాఫిక్ పెరిగి సమయం వృథా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రెండో లైన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గతంలోనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మార్గంలో రెండో లైన్ ఏర్పాటైతే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం.. ఏపీలోని పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

Also Read: Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం- హామీల అమలుపై ఫోకస్ అన్న భట్టి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget