అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

TS Congress : రేవంత్‌తో పాటు సీనియర్ల పాదయాత్ర - టీ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ రాజీ ఫార్ములా రెడీ చేశారా ?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లను కూల్ చేయడానికి కొత్త ఇంచార్జ్ ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. పాదయాత్రను సీనియర్లు కూడా చేయవచ్చని చెప్పినట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

 

TS Congress :  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి పని చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే ప్రకటించారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీలో పరిణామాలపై చర్చించామని ఆయన ప్రకటించారు. గాంధీ భవన్‌లో టీ  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.  సీనియర్ నేతలతో మాట్లాడి, సమాచారం తీసుకున్నాం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించామని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కార్యకర్తలు, నాయకులు బలంగా ఉన్నారని తెలిపారు.  నేతలు, కార్యకర్తలు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు  సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ లో ఇప్పుడు చాలా కీలకమైన సమయమని భారత్ జోడో యాత్ర దేశంలో విజయవంతంగా నడుస్తుందన్నారు.  భారత్ జోడో యాత్ర పూర్తయ్యాక కొనసాగింపుగా దేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభం అవుతుందని..  భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాహుల్ సందేశాన్ని దేశంలో ప్రతీ ఇంటికి చేరవేసేందుకె హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా చేరవేస్తామన్నారు. జనవరి 26 నుంచి రెండు నెలలపాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుందని.. తెలంగాణలో ప్రతీ ఇంటికే రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేయాలని పిలుపునిచ్చారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా అంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రతీ జిల్లా, ప్రతీ బ్లాక్ లో రెండు నెలలపాటు యాత్ర కొనసాగుతుందని..  ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త,నాయకులు పాల్గొనాలని మాణిక్ రావ్ థాక్రే కోరారు. 

టీ కాంగ్రెస్ ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు మాణిక్ రావు థాక్రే సమావేశం నిర్వహించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ముంబై బాంబు బ్లాస్ట్,  మతకల్లోలాలు జరిగిన సమయంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారని.. క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే ఎంతో సమర్థవంతంగా పని చేశారన్నారు. వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు హోంమంత్రిగా జానారెడ్డి గారిలా... శరత్ పవార్ హయాంలో ఠాక్రే అంతటి సమర్థవంతంగా పనిచేశారన్నారు.  సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తారని ఆయనకు గుర్తింపు ఉందని తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్ర నేపథ్యంలో పార్టీలో అందరితో ఆయన మాట్లాడారని.. 21న మరోసారి పర్యటించి పూర్తి స్థాయిలో హాత్ సే హాత్ జోడో యాత్ర కమిటీలను ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్ ఇంచార్జికి సీనియర్లు రేవంత్ రెడ్డి విషయంలోనే ఎక్కువగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఏకపక్ష పోకడలకు పోతున్నారని.. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాదయాత్ర విషయంలో తానే పాదయాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని కానీ..  ప్రతీ నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుందని చెప్పడం లేదని ఆయనంటున్నారు. అయితే ఒక్క రేవంత్ మాత్రమే కాకుండా సీనియర్లందరూ పాదాయత్ర చేయవచ్చని..  కొత్త ఇంచార్జి సీనియర్లను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. ఇరవయ్యో తేదీ తర్వాత మరో మూడు రోజుల పాటు తెలంగాణ పర్యటనకు వస్తానని అప్పుడు పూర్తి స్థాయిలో చర్చిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget