అన్వేషించండి

YS Sharmila : పోలీసులే దురుసుగా ప్రవర్తించారు, కోర్టులో షర్మిల వాదనలు

YS Sharmila : పోలీసులపై దాడి కేసులో షర్మిలకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మే 8 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద జరిగిన ఘర్షణ అనంతరం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఎలాంటి పోలీస్ వారెంట్ లేకుండా తన ఇంటి మీదకి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారని షర్మిల వాదనలు వినిపించారు. పోలీసులు ఎలాంటి అరెస్టు నోటీసు ఇవ్వలేదన్నారు.  పైగా పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారన్నారు. తనను తాకే ప్రయత్నం చేశారన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులను నెట్టివేశానని కోర్టుకు తెలిపారు. అయితే షర్మిల రిమాండ్ పై వాదనలు ముగిశాయి. ముందు తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. తాజాగా షర్మిలకు రిమాండ్ విధించింది.  14 రోజుల పాటు మే 8 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో ఆమెను జైలుకు తరలించారు. 

పోలీసులే దురుసుగా ప్రవర్తించారు 

షర్మిల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... TSPSC పేపర్ లీకేజ్ కేసుపై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. షర్మిలను ప్రతిసారి పోలీసులు టార్గెట్ చేస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. పోలీసులే షర్మిలపై దురుసుగా ప్రవర్తించారన్నారు. 41 crpc నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాలలోపు శిక్ష మాత్రమేనన్నారు. షర్మిల రిమాండ్ రీజెక్ట్ చెయ్యాలని ఆమె తరఫు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామన్నారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ పోలీసులు టచ్ చేశారని కోర్టుకు వెల్లడించారు. షర్మిల దర్యాప్తునకు సహకరిస్తామని స్పష్టం చేశారు.  

పోలీసులపై దాడిని ఖండించిన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ 

ఎస్సై, కానిస్టేబుల్ వైఎస్ షర్మిల చేయి చేసుకోవడంపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్ షర్మిల, విజయమ్మ దాడిని ఖండిస్తున్నామని తెలిపింది.  శాంతి భద్రతల విధుల్లో ఉన్న పోలీసుల పట్ల వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రవర్తించిన తీరు, దురుసుతనాన్ని ఖండిస్తున్నామని హైదరాబాద్ సిటీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలతో పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బతింటుందన్నారు. రాజకీయనాయకులు పోలీసుల సహనాన్ని పరీక్షించకూడదని హెచ్చరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాలను అదుపుచేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలో అత్యున్నత గుర్తింపు ఉందన్నారు. కానీ కొంతమంది రాజకీయ నేతలు ఇటీవల కాలంలో వ్యక్తిగత గుర్తింపు కోసం  చౌకబారు చర్యలతో పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. 

షర్మిలపై కేసు నమోదు 

లోటస్ పాండ్ వద్ద పోలీసుల మీద దాడి చేసిన వైఎస్ షర్మిలతో పాటు కారును ఆపకుండా పోనిచ్చిన ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. కానిస్టేబుల్ గిరిబాబు కాలు మీద కారు ఎక్కించిన షర్మిల కాన్వాయ్ లో ఇద్దరు  డ్రైవర్ ల మీద  బంజారాహిల్స్ ఎస్ ఐ రవీందర్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదుతో ఐపీసీ  332, 353 , 509, 427 సెక్షన్స్ కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. వైఎస్ షర్మిల పోలీసుల వద్ద మాన్ పాక్స్ లాక్కొని పగలగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిలపై 337, రెడ్ విత్ 34 కింద మరో రెండు సెక్షన్లు నమోదు చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ కానిస్టేబుల్ గిరిబాబును స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్‌ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు డాక్టర్స్ గుర్తించారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదుతో  బంజారాహిల్స్‌ పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget