Ys Sharmila Comments: ఎవర్రా నీకు మరదలు, మెట్టుతో కొడతాను - మంత్రిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
#PrajaPrasthanam: స్త్రీలో చెల్లిని,తల్లిని చూడలేని సంస్కార హీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అధికార మదంతో మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతయ్ అని హెచ్చరించారు.
YS Sharmila: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర (#PrajaPrasthanam) వనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గం వనపర్తి. అయితే తన పాదయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం నాడు మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలో చెల్లిని,తల్లిని చూడలేని సంస్కార హీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు (చెప్పు) దెబ్బలు పడుతయ్ అని హెచ్చరించారు. యువత హమాలీ పని చేసుకోవాలని, రైతులు వరి వేసుకోవద్దని చెప్పే నువ్వు ఒక మంత్రివా? అంటూ మండిపడ్డారు.
మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టారు షర్మిల. ఈ సందర్భంగా ఆమె మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల కోసం తాను ప్రతి మంగళవారం నాడు నిరాహార దీక్షలు చేస్తుంటే.. నిరంజన్ ఏమన్నాడంటే ప్రతి మంగళవారం మరదలు అని కామెంట్ చేశాడని గుర్తుచేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వదిలి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వైఎస్సార్ టీపీ పోరాడుతోందన్నారు. కానీ మంత్రి అధికార మదంతో మాట్లాడుతున్నారని, ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు అంటూ మంత్రిపై మండిపడ్డారు.
స్త్రీలో చెల్లిని,తల్లిని చూడలేని సంస్కార హీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి.అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతయ్. వీధి కుక్కకు నీకు తేడా లేదు.యువత హమాలీ పని చేసుకోవాలని,రైతులు వరి వేసుకోవద్దని చెప్పే నువ్వు ఒక మంత్రివా?#PrajaPrasthanam #Wanaparthy pic.twitter.com/07aZvPURMn
— YS Sharmila (@realyssharmila) September 9, 2022
బంగారు తెలంగాణలో హమాలీల్లా బతకాలా..
ఎంతో కష్టపడి డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తుంటే.. తెలంగాణలో హమాలీ పనికి మించిన పని లేదు అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. బంగారు తెలంగాణలో నిరుద్యోగులు హమాలీ పని చేసుకుని బతకాలా అని ప్రశ్నించారు. అయితే నువ్వు కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి హమాలీ పని ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు. వరి వేస్తే ఉరి అంటారు. రుణ మాఫీ చేయడం సాధ్యం కాలేదు. పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం వీరికి చేతకావడం లేదని, ఇలాంటి వారిని సన్నాసులు కాకపోతే ఇంకేం అనాలంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వివాదం ఇదీ..
2021లో నాగర్‌కర్నూల్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగిస్తూ.. షర్మిల మంగళవారం దీక్షలను.. మంగళవారం మరదలు అంటూ కామెంట్ చేశారు గతంలో దీనిపై స్పందించిన షర్మిల.. చందమామను చూసి కుక్కులు మొరగడం సహజం. కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది ? సంస్కారం లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి నిరంజన్ రెడ్డి తన వ్యాఖ్యలపై అప్పట్లోనే వెనక్కితగ్గుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.