అన్వేషించండి

Mallu Ravi: కేటీఆర్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న మల్లు రవి

Telagnana Congress leader Mallu Ravi: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana MLC Elections 2024: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్‌ పిలానీలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా..? అని మల్లు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్‌ పిలానీ స్టూడెంట్‌ అని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బ్లాక్‌మెయిలర్‌ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తాజాగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బిట్స్‌ పిలానీలో చదివిన వ్యక్తిని అభ్యర్థిగా పెట్టామని చెబుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు.. అక్కడ చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతున్నారా..? అని మల్లు రవి ప్రశ్నించారు. బిట్స్‌ పిలానీలో చదివిన వాళ్లే పట్టభద్రులుగా, మిగిలిన వాళ్లు కాదన్నట్టుగా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులపై భారతీయ రాష్ట్ర సమితి నాయకుల వైఖరి ఏమిటో వారి మాటల్లోనే తెలుస్తోందని విమర్శించారు. తీన్మార్‌ మల్లన్న పోటీకి అర్హుడు కాబట్టే ఎన్నికల కమిషన్‌ అంగీకరించిందని, కాబట్టి కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్న మల్లు రవి.. ఈసీ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ

జూన్‌ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీ విస్తున్నారని మల్లు రవి పేర్కొన్నారు. ఆమెను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్టు వివరించారు. తెలంగాణ సాధనకు పని చేసిన అన్ని పార్టీలను వేడుకలకు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ గురించి సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారని, ఆ పార్టీలన్నీ తీన్మార్‌ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయన్నారు. మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత కాంగ్రెస్‌ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళతారన్నారు. శాసన మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగులు, మహిళలు గురించి తీన్మార్‌ మల్లన్న తన గొంతును వినిపిస్తారని, ఆ నమ్మకం తనకుందని రవి స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget