Ganesh Navratri : ఊరందరూ ఒక్కటే - ఊరికి ఒక్కటే గణేష్ మండపం ! ఈ ఐక్యత ఎక్కడో కాదు
Nalgonda : ఒక్క అపార్టుమెంట్‌లోనే రెండు వర్గాలుగా విడిపోయి వినాయక విగ్రహాలు పెట్టుకునే కాలంలోకి వచ్చేశాం. కానీ కొన్ని గ్రామల ప్రజలు మాత్రం.. ఇప్పటికి ఐక్యత చాటుకుంటున్నారు.
Nalgonda district Kesavapuram Villagers : గణేష్ నవరత్రాలు వస్తే వీధి వీధినా.. ఇంకా చెప్పాలంటే.. ప్రతీ లైన్‌లో గణేష్ మండపాలు వెలుస్తూంటాయి. క్షణం తీరిక లేని జీవితాలు గడిపే పట్టణ ప్రజలు కూడా తీరిక చేసుకుంటారు. అయితే ఇక్కడా వారి మధ్య ఐక్యత ఉండదు. ఒక కాలనీ అసోసియేషన్ లోనే మూడు, నాలుగు గ్రూపులు ఉంటాయి. ఎవరికి వారు ఉత్సవ విగ్రహాలను పెట్టుకుంటారు. ఇక గ్రామాల్లో సంగతి చెప్పాల్సిన పని లేదు. లోకల్ పాలిటిక్స్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను డామినేట్ చేస్తాయి. ఒక్కోసారి గొడవలు జరిగిపోతాయి.
కేశవాపురం గ్రామస్తుల ఐక్యత
కానీ కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం ఎవరూ ఊహించని ఐక్యత చూపిస్తూంటారు. కుమాలు, మతాలు, రాజకీయాలు అన్నింటినీ వదిలేసి.. తమ గ్రామం మొత్తం కొన్ని విషయాల్లో ఏకంగా ఉంటామని నిరూపిస్తూనే ఉంటారు. అలాంటి గ్రామం ఒకటి నల్లగొండ జిల్లాలో ఉంది. మాడ్గుల పల్లి మండలం కేశవాపురం గ్రామం కాస్త పెద్దదే. అన్ని కులాల వారు ఉంటారు. వారు వినాయక చవితి విషయంలో చాలా పక్కాగా ఉంటారు. భిన్నాభిప్రాయాలకు పోరు. రెండో మండపం అనే అంశాన్ని అసలు పట్టించుకోరు. ఊళ్లో ఒకే విగ్రహాన్ని పెట్టుకుంటారు. మండపాన్ని ఏర్పాటు చేస్తారు. అందరికీ పూజలకు అవకాశం కల్పిస్తారు.
గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
వేరే ఆలోచనే రానివ్వని గ్రామస్తులు
ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. గత కొన్నేళ్లుగా వీరు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దేవుడు ఒక్కడే అని మత సామరస్యాన్ని పాటించడానికి్ ఈ విధానం బాగుంటుందని ఇతర మతాల వాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు ఇందులో పాల్గొనడంతో సందడి ఉంటుంది. వీరి మధ్య చిచ్చు పెట్టి .. గ్రూపులు వచ్చేలా చేసి.. రాజకీయ పబ్పం గడుపుకోడానికి చాలా మంది రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజల్లో చీలిక తెచ్చి ప్రత్యేక మండపాలు పెట్టుకుంటే ఆర్థిక సాయం చేస్తామని ఆఫర్లు కూడా ఇచ్చారు. కానీ గ్రామస్తులు ఎవరూ.. అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు.. అలాంటి ఆఫర్లతో వచ్చిన వారిని ఎంటర్ టెయిన్ చేయలేదు.
గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది!
అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం
కేశవాపురం గ్రామ పంచాయతీ గణేషుడు అందుకే ఐక్యతగా నిలుస్తున్నాడు. నల్లగొండ వ్యాప్తంగా ఈ కేశవాపురం గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. నిజానికి ఎక్కువ విగ్రహాలు పెట్టడం గొప్ప అని అనుకుంటారు.. కానీ అది అనైక్యతకు నిదర్శనం. గ్రామానికి ఒక్క వినాయకుడ్నిపెట్టుకుని పూజిస్తే.. సరిపోతుందని.. అందరూ ఐక్యంగా సంబరాలు చేసుకున్నట్లుగా ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని కేశవాపురం ప్రజలు నిజమని నిరూపిస్తున్నారు.