అన్వేషించండి

Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం

Tragic incident in Yadadri Bhuvanagiri district | తండ్రి ప్రేమగా పండు ఇస్తే తీసుకుని తిన్న రెండేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో జరిగింది.

సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. కన్నకూతురిపై మమకారం కన్నా భార్యపై ఉన్న పగ, పరువు పోతుందన్న ఆందోళనే ఎక్కువగా భావించిన ఓ తండ్రి, తన రెండేళ్ల కూతురి ప్రాణాలు తీశాడు. తన దగ్గరే ఉంటున్న కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చి హత్యచేశాడు. తండ్రి ప్రేమతో ఇస్తున్నాడని భావించిన ఆ చిన్నారి ఆ పండును తిని ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ దారుణానికి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలేనని పోలీసులు తెలిపారు.

భార్యాభర్తల మధ్య గొడవలు.. పుట్టింటికి వెళ్లిన భార్య..

లచ్చమ్మగూడెంకు చెందిన రవికి, రంగారెడ్డి జిల్లాకు చెందిన స్వాతికి మూడేళ్ల కిందట వివాహం కాగా, వీరికి సంతానం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా 3 నెలల కిందట స్వాతి చిన్న కుమార్తె మయూరి(9 నెలల)ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోగా, పెద్ద కుమార్తె మేఘన తండ్రి రవి వద్దే ఉంటోంది. అయితే, పెద్ద కుమార్తెను కూడా తన వద్దకు పంపాలని స్వాతి పోలీసులను ఆశ్రయించడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. పెద్ద కూతురు తనకు దూరం అవుతుందని ఓవైపు, భార్యపై కోపంతోనూ రవి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చిన తండ్రి..

 సపోటా పండులో విషం కలిపి ఇచ్చిన తర్వాత, చిన్నారి వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రవి కూడా నిద్రమాత్రలు, ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు రవిని నల్గొండకు, మేఘనను హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మేఘన సోమవారం చనిపోయింది.  మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా, తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోకం తెలియని ఒక పసి ప్రాణం తండ్రి చేతిలోనే బలైపోవడం స్థానికులను సైతం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget