News
News
X

KCR News: వడ్లు కొనరు, వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారా? మునుగోడు సభలో కేసీఆర్ ధ్వజం

చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వేసిన ప్రధాని మోదీనే అని కేసీఆర్ విమర్శించారు. కేంద్రానికి బుద్ధి రావాలంటే చేనేత కుటుంబాలు ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దని పిలుపునిచ్చారు.

FOLLOW US: 
 
తెలంగాణలో యాసంగి వడ్లు కొనాలని అడిగితే కేంద్ర ప్రభుత్వానికి చేతగాలేదని, అలాంటిది డబ్బు సంచులతో ఎమ్మెల్యేలను కొనేందుకు హైదరాబాద్ వచ్చారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. 

‘‘మన పంట వడ్లు కొనాలని అడిగితే స్పందించరు కానీ, రూ.వందల కోట్ల సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనాలని వస్తరా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా వద్దా? మీరంతా ఆలోచించాలి. వీటన్నింటికీ మీరు జవాబు చెప్పకపోతే వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తరు. మేం చేసేది ఏమీ ఉండదు’’ అని కేసీఆర్ అన్నారు.

చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వేసిన ప్రధాని మోదీనే అని విమర్శించారు. కేంద్రానికి బుద్ధి రావాలంటే చేనేత కుటుంబాలు ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దని పిలుపునిచ్చారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయకపోతే పెట్టుబడి దారులను, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే వాళ్లను మనమే ప్రోత్సహించినట్లుగా అవుతుందని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలను కూడా అంగీకరించినట్లే అవుతుందని అన్నారు.

‘‘మన భారత విద్యుచ్ఛక్తి సంస్థలు ఇన్నేళ్ల నుంచి రూ.లక్షల కోట్లతో ఒక వ్యవస్థలా ఏర్పడ్డాయి. అలాంటి సంస్థలను పేలాలు అమ్మినట్లుగా ప్రైవేటు సంస్థలకు ఇస్తరట. వాడు మళ్లీ మన దగ్గర్నుంచే డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తరు. అలాంటి వ్యవస్థలను ప్రైవేటు కార్పొరేటు గద్దలకు అప్పజెప్తమా? అందరూ ఆలోచించండి.’’

News Reels

‘‘గ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. జీఎస్టీ ఎస్తున్నారు అని మనం కొట్లాడాలి. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? వారి చేతిలో కత్తి పెడితే.. వాడు మన మెడ కోసేస్తడు. కాబట్టి, కత్తి ఒకడి చేతిలో పెట్టి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే సమంజసం కాదు. ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచిగుంటమని గమనించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Published at : 30 Oct 2022 05:58 PM (IST) Tags: PM Modi TRS News KCR on Modi Munugode Bypoll CM KCR KCR Speech in Munugode

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

Nalgonda: ఏడాదిగా సమైఖ్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు - గుత్తా సంచలన వ్యాఖ్యలు

Nalgonda: ఏడాదిగా సమైఖ్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు - గుత్తా సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!