Ghatkesar-Yadadri MMTS Expansion: ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు MMTS: భక్తులకు, ప్రజలకు శుభవార్త! రైల్వే విస్తరణతో కొత్త అవకాశాలు!
Ghatkesar-Yadadri MMTS Expansion: ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజల కలగా ఉన్న ఘట్కేసర్-యాదాద్రి MMTS విస్తరణకు కేంద్రం ఓకే చెప్పింది. వంద కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.

Ghatkesar-Yadadri MMTS Expansion: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. ఘట్కేసర్ నుంచి యాదాద్రి (రాయగిరి) వరకు 33 కిలోమీటర్ల దూరంలో మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) విస్తరణకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును సాధించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.
ఈ నిర్ణయంపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు భువనగిరి ప్రజల భవిష్యత్‌కు సరికొత్త బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్ వినిపిస్తోంది. ఏడాది ఏప్రిల్ నెలలో కూడా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీలు లేవనెత్తారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ రూట్ పొడిగిస్తే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వాదించారు.
#AdminPost
— Kiran Kumar Chamala (@kiran_chamala) July 16, 2025
గత పార్లమెంట్ సమావేశాలలో ఘట్కేసర్ నుండి యాదాద్రి వరకు MMTS కు పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించి నిధులు విడుదల చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ గట్టిగా కొట్లాడడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి MMTS కు కావలసిన మొత్తం 412 కోట్లు… pic.twitter.com/smwlDNHGyU
అప్పట్లో కాంగ్రెస్ ఎంపీలు వేసిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వివరణాత్మక సమాధానం ఇచ్చారు. కేంద్రం సహకారం పూర్తిగా ఉంటుందని అప్పుడే తెలిపారు. చెప్పినట్టుగానే ఇప్పుడు ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు 33 కిలోమీటర్ల MMTS విస్తరణ ప్రాజెక్టును ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు మొదటి విడతగా కేటాయించింది. ఈ నిధుల విడుదలతో పాటు, భూసేకరణ, ఇతర ముందస్తు పనులు వేగవంతం చేయడానికి అవకాశం కల్పించింది.
రైల్వే విస్తరణ ప్రాముఖ్యత
ఈ MMTS విస్తరణ రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. ఈ 33 కిలోమీటర్ల ప్రాజెక్టు ద్వారా, ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు సుస్థిర, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గం ప్రధానంగా యాదాద్రి దేవాలయానికి వెళ్లే లక్షల మంది భక్తులకు, సమీప ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు పూర్తైన తర్వాత, రోడ్డు రవాణా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టు సమీప గ్రామాల్లోని ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ మార్గం నిర్మాణం కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, రాష్ట్రంలో పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది.





















