ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
Khammam BRS Atmiya Sammelanam: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే విజయం వరిస్తుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని గులాబీ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో పదికి 10 స్థానాలు వస్తాయని, క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్పై విమర్శలు చేసిన వారు శంకరగిరి మాన్యాలలో కలిసి పోయారని అన్నారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలి డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రవేశపెట్టిన పథకాలే బీఆర్ఎస్ కు ఘన విజయాన్ని అందిస్తాయన్నారు.
డబ్బు, స్వార్థ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో నడవవని చెప్పారు. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ అని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసునన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో పెట్టుకున్న వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టారని, పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శలు చేస్తున్న వారికి ఓటర్లు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. కొందరు నేతలు తమ స్వలాభం, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన వారు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడమా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలుస్తూనే ఉంటుందని, కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని.. వారికి త్వరలోనే కనువిప్పు కలుగుతుందని ఎద్దేవా చేశారు. నగరంలో జరిగిన ముస్లిం సోదరుల రంజాన్తోఫా కార్యక్రమంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.
@BRSparty పార్టీ జాతీయ అధ్యక్షులు #KCR గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ఆదేశాల మేరకు #Khammam నియోజకవర్గ కేంద్రంలో నగర పార్టీ అధ్వర్యంలో ఖానాపురం హవేలి డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడమైంది(1/2). pic.twitter.com/TCTn396vZI
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) April 16, 2023
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించిన మంత్రి
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఖమ్మం జిల్లాలో రంజాన్తోఫాను మంత్రి పువ్వాడ అజయ్ అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. అన్ని కులాలు, మతాల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ఖమ్మం లోని 37,38,39,40 డివిజన్లోని పేద ముస్లింలకు రంజాన్ తోఫాను ప్రభుత్వం ఉచితంగా అందించింది. ముస్లింలు అందరికీ మంత్రి పువ్వాడ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అన్ని కుల,మత సామరస్యానికి ప్రతీక #BRS ప్రభుత్వం.#Ramjan సందర్భంగా #Khammam నగరంలోని 37,38,39,40వ డివిజన్లలో పేదముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న తోఫా(దుస్తులు)లు, #PuvvadaFoundation సమకూర్చిన #SamiyaKits పంపిణీ(1/2) @TelanganaCMO @MinisterKTR @KTRBRS @mahmoodalitrs pic.twitter.com/sjEO1bEsdp
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) April 16, 2023
ఖమ్మం జిల్లా చీమలపాడు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీస్ దావా నవీన్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. అధైర్య పడొద్దని, పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్యచికిత్సలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?
TS Inter Exams: ఇంటర్ సప్లిమెంటరీ హాల్టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్మెంట్, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష
Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?