News
News
X

ఆ మాటలకు ప్రజలు నవ్వుతున్నారు- కేసీఆర్‌పై ఈటల సెటైర్లు

గూట్లో రాయి తీయలేని వ్యక్తి ఏట్లో రాయి తీయడానికి వెళ్లాడట అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ మాటలను వేరే రాష్ట్రవాళ్లు ఎవరూ నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.

FOLLOW US: 

చౌటుప్పల్ మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈటల రాజేందర్. అనంతరం బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. పీడిత ప్రజానీకం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టిస్తానని చెప్పి సీఎం కేసీఆర్‌ మర్చిపోయారు. విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడంతోపాటు ఆమె జయంతి, వర్ధంతిని ప్రభుత్వపరంగా జరపాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం కూడా త్వరితగతిన పూర్తి చెయ్యాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన సదుపాయాలు ఇంతవరకు ఇవ్వలేదని... వాటిని వెంటనే నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ చతికిలపడిపోతుందని విమర్శించారు ఈటల. కెసిఆర్ నియంతృత్వం, దోపిడీ అరికట్టలేకపోయారని చెప్పారు. బీజేపీకి మాత్రమే ఆసత్తా ఉందని బీజేపీలో చేరారనీ... ధర్మానికి కట్టుబడి రాజీనామా చేసి ప్రజల ముందుకు ముందుకొచ్చారని తెలిపారు. 

కెసిఆర్‌ను ఓడించడానికి అనేకమంది ప్రజాప్రతినిధులు, నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారన్నారు ఈటల. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్‌లో చేసినట్టే మునుగోడులో కూడా చేస్తుందని ఆరోపించారు. మద్యం పంచి, డబ్బులు ఇచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు

సర్పంచ్‌లకు బిల్లులు రావాలి అంటే టిఆర్ఎస్ పార్టీలో చేరాలి.. లేదంటే పదవే పీకేస్తామని కలెక్టర్‌ను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారని ఆరోపించారు ఈటల. చాలా మంది సర్పంచ్‌లు ఫోన్ చేసి చెప్తున్నారన్నారు. తాము మనుషులుగా టీఆర్ఎస్‌లో ఉన్నామని... తామంతా బీజేపీతోనే వస్తామంటూ చెప్తున్నారన్నారు. కెసిఆర్‌కి గుణపాఠం చెప్పకపోతే బతుకు లేదన్న అభిప్రాయంతో చాలా మంది నేతలు ఉన్నారని... కట్టుబానిసలుగా చూస్తున్నారనీ...గౌరవం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కెసిఆర్‌ను గెలవనిచ్చేది లేదనీ వారంటున్నారని తెలిపారు.

రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాతే మర్రిగూడెం మండలంలో భూనిర్వాసితులకు పరిహారం అందిస్తున్నారని వెల్లడించారు ఈటల. ఉపఎన్నిక వస్తేనే కెసిఆర్ కదులుతారన్నారు. లేదంటే ఇనుప కంచెల లోపల, పోలీసు పహారాలో ఉంటారని విమర్శించారు. కులం, పార్టీ, జెండాతో సంబంధం లేకుండా రాజగోపాల్ రెడ్డినీ గెలిపించడానికి మునుగోడు ప్రజలు సిద్దం అయ్యారని అభిప్రాయపడ్డారు. 

గూట్లో రాయి తీయలేని వ్యక్తి ఏట్లో రాయితీయడానికి పోయినట్టు ఉంది కెసీఆర్ వ్యవహారం అని విమర్శించారు ఈటల. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతున్నారన్నారు. ధనిక రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారు. 24 గంటల కరెంటు ఇస్తా అని 9 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారన్నారు. కరప్షన్‌కి మారుపేరు కెసిఆర్,
కుటుంబ పాలనకు మారుపేరు కెసిఆర్ అని ఆరోపించారు ఈటల. 

ప్రజల విశ్వాసం కోల్పోయిన కెసిఆర్ దేశాన్ని పాలిస్త అనే మాటలను బఫూన్ మాటలుగా అనుకుంటున్నారన్నారని తీవ్ర కామెంట్ చేశారు రాజేందర్‌. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆహా ఓహో అనుకుంటున్నారు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కెసిఆర్ పట్ల విశ్వాసం లేదని తేల్చేశారు ఈటల రాజేందర్‌. ఇక్కడే చెల్లని రూపాయి కెసిఆర్ అని ఈటల రాజేందర్ వ్యంగంగా అన్నారు.

Published at : 10 Sep 2022 02:08 PM (IST) Tags: BJP TRS KCR Telangana Politics Etela Rajendera

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ కనిపించదు: ఈటల

మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ కనిపించదు: ఈటల

Kothagudem Politics: ఎన్నికల్లో పొత్తులు ఉంటే జలగం వెంకటరావు ఏ ఎత్తు వేయబోతున్నారు !

Kothagudem Politics: ఎన్నికల్లో పొత్తులు ఉంటే జలగం వెంకటరావు ఏ ఎత్తు వేయబోతున్నారు !

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి