అన్వేషించండి

Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న టెన్షన్, ప్రాజెక్టు గేట్లు ఏపీ పోలీసులు స్వాధీనం!

ఓ వైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్ నడుస్తుంటే మరోవైపు నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి విడుదల అంశం మరోసారి తెలంగాణ పోలింగ్ రోజున రచ్చరచ్చగా మారింది.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త వాతావారణం కొనసాగుతోంది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను, డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్‌ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  రెండు రాష్ట్రాలకు చెందిన వందల మంది పోలీసులు అక్కడ భారీగా మోహరించడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డ్యామ్ పై ఉన్న పరిస్థితిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Also Read: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

అంబటి రాంబాబు వివాదాస్పద ట్వీట్
ఇంత ఉద్రిక్తత నడుస్తున్న సమయంలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై ట్వీట్ చేశారు.  ‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నాము!’ అంటూ సంచలన కామెంట్ పెట్టారు.

వ్యూహాత్మక వివాదం- రేవంత్ రెడ్డి
ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలింగ్‌కు ముందు రోజు కావాలనే సెంటిమెంట్‌ను రగిల్చేందుకే వ్యుహాత్మకంగా వివాదం సృష్టించారని బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం నాగార్జున సాగర్‌ వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై మాట్లాడారు. 

ఇదంతా కేసీఆర్ కుట్ర - కోమటిరెడ్డి
ఈ ఘటనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలింగ్ రోజునే ఈ ఘటన సంభవించడంతో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం పై అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా కెసిఆర్ చేస్తున్న కుట్ర అన్నారు. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ డ్రామాకు తెరలేపిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తెలుగు ప్రజలకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లతో పాటు బీజేపీ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ ముగ్గురూ కలిసి పోలింగ్ వేళ రాజకీయ లబ్ధిపొందేలా నాగార్జున సాగర్ వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించారని మండిపడ్డారు. నీటి వివాదం కొత్తది కాదని.. కానీ, రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్‌కు ముందు రోజు వివాదం క్రియేట్ చేశారని అన్నారు. కేవలం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రే అని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రలను తెలుగు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు నారాయణ.

నేతలు తొందరపడొద్దు -వికాస్ రాజ్
ఈ విషయంపై స్పందించిన  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్..రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. నేతలెవరూ కూడ  నిబంధనలను అతిక్రమించవద్దన్నారు. తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్నారు.

మొత్తంగా తెలంగాణ పోలీసుల కంట్రోల్లో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ కి ఏపీ పోలీసులు వెళ్లడం, అది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్న రోజునే కావడంతో అక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వ చర్యలపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చేందుకే సాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget