అన్వేషించండి

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

సాగర్ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగ భాగం.. అంటే 13వ గేట్‌ వరకు ప్రాజెక్టు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర గురువారం (నవంబరు 30) తెల్లవారుఝామున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి నీటి విడుదలకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా బుధవారం (నవంబరు 29) అర్ధరాత్రి దాటాక అక్రమంగా ప్రాజెక్టులోనికి చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచె పెట్టారు. సాగర్ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగ భాగం.. అంటే 13వ గేట్‌ వరకు ప్రాజెక్టు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దాదాపు 500 మంది దాకా పోలీసు సిబ్బందితో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. 

వారిని డ్యామ్ కు కాపలాగా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిపై దాడి చేసి.. వారి మొబైల్ ఫోన్లు కూడా లాక్కున్నారు. 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచె పెట్టి.. డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఏపీ పోలీసులు.

సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. పల్నాడు జిల్లాలో భారీగా మోహరించి రాత్రి సమయంలో సాగర్ కు వెళ్లారు. సాగర్ వద్ద మీడియాపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి జులుం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ఏపీ పోలీసులు లాక్కున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొని ఉంది.

ఇదంతా కేసీఆర్ పనే - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సాగర్ డ్యాంపై పోలీసుల హడావిడిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సాగర్ డ్యాంపై పోలీసుల డ్రామా కేసీఆర్ పనే అని విమర్శించారు. ఓడిపోతున్నారని కేసీఆర్ కి అర్థమై  తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారు. కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని.. 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

స్పందించిన ఎన్నికల కమిషనర్

నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరుగుతున్న హైటెన్షన్ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పందించారు. రాజకీయ నేతలు ఎవరూ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. డ్యాం దగ్గర జరుగుతున్న వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget