MLC Kavitha comments : బీజేపీ నేతలు చెబితే అరెస్ట్ చేస్తారా ? - విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయన్న కవిత !
కేంద్రాన్ని ప్రశ్నించిన వారిపై దర్యాప్తు సంస్థలు కక్ష సాధిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
MLC Kavitha comments : కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు కొంత మంది .. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసినట్లుగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తారని ప్రకటిస్తారని.. బీజేపీ నేతలు చెప్పినంతనే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయా అని ప్రశ్నించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశం నిర్వహించిన కవిత.. కేంద్రం, బీజేపీ, దర్యాప్తు సంస్థల తీరుపై మండిపడ్డారు.
మోదీ వైఫల్యాలపై నిలదీస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు
దర్యాప్తు సంస్థలు పూర్తిగా విపక్ష నేతలనే టార్గెట్ చేశాయన్నారు. భారీ స్కాంకు పాల్పడిన అదానీ విషంయలో సీబీఐ, ఈడీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని కవిత ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే సెబీతో పాటు .. ఓ కమిటీ విచారణకు ఏర్పాటయిందన్నారు. ప్రధానమంత్రి మోదీ వైఫల్యాలపై నిలదీస్తే దర్యాప్తు ఏజెన్సీలతో భయపెడుతున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారని.. అలా చేస్తారా లేదా అన్నది దర్యాప్తు సంస్థలే చెప్పాలన్నారు. ఒక వేళ బీజేపీ నేతలే అన్నీ చెబితే ఇక దర్యాప్తు ఏజెన్సీలు ఎందుకని కవిత ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా.. మహిళ రిజర్వేషన్ బిల్ ను బీజేపీ తీసుకరవలని డిమాండ్ చేస్తున్నామమని కవిత స్పష్టం చేసారు. బీజేపీ మనిపేస్ట్ లో మహిళ రిజర్వేషన్ బిల్ తీసుకొస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయినా ఇప్పటివరకూ తీసుకు రాలేదన్నారు. తెలంగాణ జాగృతిని ఇప్పటికే భారత జాగృతిగా మార్చారు. ఈ నెల 10 తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహిళతో కలిసి దీక్ష చేయాలని కవిత నిర్ణయించారు. భారత జగృతి ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేస్తారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో మహిళ బిల్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని కవిత స్పష్టం చేస్తున్నారు.
కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత పేరును ఇప్పటికి పలుమార్లు చార్జిషీట్లతో పాటు కోర్టుకు సమర్పించిన వివిధ పత్రాల్లో సీబీఐ ప్రస్తావించింది. సౌత్ లాబీలో ఆమె బినామీ పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్నరారని సీబీఐ ఆరోపించింది. ఇప్పటికే ఓ సారి కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకూ ఎప్పుడు రావాలో సమాచారం ఇవ్వలేదు. కానీఈ కేసులో సీబీఐ, ఈడీ వరుసగా అరెస్టులు చేస్తున్నాయి. బీజేపీ నేతలు తర్వాత కవితనే అరెస్ట్ చేస్తారని ప్రకటనలు చేస్తున్నారు.