IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Sankar Naik : ఎమ్మెల్యే జోలె పడితే రూ. ఐదు వేలొచ్చాయ్ !

సాయం చేయమని అడిగిన మహిళ కోసం జోలె పట్టారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. రూ. ఐదు వేలు సేకరించి మహిళకు ఇచ్చారు.

FOLLOW US: 

ఆయన ఎమ్మెల్యే. ఆయన ఎక్కడైనా కనబడితే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలనుకోవడం సహజం. అది వ్యక్తిగత సమస్య అయితే ఎమ్మెల్యే వ్యక్తిగతంగా సాయం చేస్తారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న సమస్య అయితే అధికారులతో మాట్లాడి చూస్తారు. ఏదీ చేయకూడదనుకుంటే పట్టించుకోకుండా వెళ్లిపోతారు. అయితే అందరు ఎమ్మెల్యేలు ఒకేలా ఉండరు. కొంత మంది శంకర్ నాయక్‌లా ఉంటారు. ఎందుకంటే ఆయన తనకు సాయం కావాలని వచ్చిన మహిళకు సాయం చేయడానికి తానే స్వయంగా జోలెపట్టారు. రూ. ఐదు వేలు సేకరించి ఇచ్చారు. 
 
మహబూబాబాద్ మున్సపాలిటి పరిధిలోని 26  వార్డు లోని కాకతీయ కాలనిలో  సిసి రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ శిలాఫలకాన్ని ఆ విష్కరించింది  ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎమ్మెల్యే వస్తున్నారంటే సహజంగానే మున్సిపాలిటీలోనే ఉన్న ప్రముఖనేతలంతా వస్తారు. వచ్చారు.  వారితో పాటు చేతికి కట్టు కట్టుకుని ఉన్న  ఓ మహిళ కూడా వచ్చింది. కార్యక్రమం అంతా అయిపోయే వరకూ ఓపిగ్గా ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఆమె ఎమ్మెల్యే  వద్దకు వెళ్లి తన దుస్థితికి చెప్పుకుంది. తన పేరు కసిరెడ్డి మధులత అని.. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యానని తెలిపింది. ఓ చేతికి దెబ్బతగిలిందని ఏ పనీ చేసుకోలేకపోతున్నానని కొంత ఆర్థిక సాయం చేయాలని కోరింది. 

మామూలుగా అయితే ఎమ్మెల్యే తన జేబులో చేయి పెట్టి  చేతికి ఎంత వస్తే అంత తీసిస్తారు.  కానీ శంకర్ నాయక్ మాత్రం జేబులో చేతులు పెట్టలేదు. పక్కన వ్యక్తి దగ్గర ఉన్న ఎర్ర తువ్వాలు తీసుకున్నారు. దాన్ని మెడలో వేసుకుని జోలె పట్టారు. మధులతకు సాయం చేయండని ఆ కార్యక్రమానికి వచ్చిన వారందర్నీ అడిగారు. వచ్చిన వారంతా తలా కొంత వేశారు. చివరికి బందోబస్తుకు వచ్చిన పోలీసులు కూడా కొంత సాయం చేశారు. మొత్తం లెక్క కడితే రూ. ఐదు వేలు అయ్యాయి. అక్కడే ఆమెకు ఇచ్చారు. అందరం సమిష్టిగా అండగా ఉండాలనే ఉద్దేశ్యం తో  జోలె పట్టి ఆడిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  తను వ్యక్తిగతంగా కూడ సహాయం చేస్తానని ఎమ్మెల్యే  శంకర్ నాయక్ చెప్పారు..ఎప్పుడు చేస్తారో చెప్పలేదు. 

అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జోలెపెట్టి అడిగితే అందరూ కలిసి ఇచ్చింది రూ. ఐదు వేలేనా అని కొంత మంది ఆశ్చర్యపోయారు.  ఎమ్మెల్యే అంటే మరీ తక్కువగా చూస్తున్నారని ఆయన అనుచరులు కొంత ఫీలయ్యారు. శంకర్ నాయక్‌ ఇటీవల వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు.  హోళీ పండుగ రోజు అనుచరుల నోట్లో మద్యం పోయడం... వరి ధర్నాలో ఎంపీ కవిత వద్ద నుంచి మైక్ లాక్కోవడం వంటి చర్యలతో వివాదాస్పదమయ్యారు. 
 
Published at : 09 Apr 2022 04:56 PM (IST) Tags: MLA Shankar Nayak mahabubabad mla Shankar Nayak help

సంబంధిత కథనాలు

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!