Godavari Level in Bhadrachalam: కాస్త తగ్గిన గోదావరి ఉదృతి, భద్రాచలంలోనే మంత్రి పువ్వాడ బస - ప్రత్యక్షంగా సహాయకార్యక్రమాలు
ముఖ్యమంత్రి సూచనల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలో బస చేసి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పరిస్థితులను కేసీఅర్ కి ఫోన్ ద్వారా వివరిస్తున్నారు.
![Godavari Level in Bhadrachalam: కాస్త తగ్గిన గోదావరి ఉదృతి, భద్రాచలంలోనే మంత్రి పువ్వాడ బస - ప్రత్యక్షంగా సహాయకార్యక్రమాలు Minister Puvvada ajay kumar visits godavari flow at bhadrachalam amid heavy rains Godavari Level in Bhadrachalam: కాస్త తగ్గిన గోదావరి ఉదృతి, భద్రాచలంలోనే మంత్రి పువ్వాడ బస - ప్రత్యక్షంగా సహాయకార్యక్రమాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/12/c6c06119132ed2d96cf570af53e6afce1657601812_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భద్రాచలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాద స్థాయికి చేరుకున్న గోదావరి ఉదృతి మంగళవారం కొంత మేర తగ్గింది. నిన్న సాయంత్రం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ప్రస్తుతం దానిని ఉపసంహరించారు.
ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలో బస చేసి అధికారులను అప్రమత్తం చేస్తూనే అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఅర్ కి ఫోన్ ద్వారా పరిస్థితులను వివరిస్తున్నారు.
మంగళవారం ఉదయం గోదావరి వంతెన, కరకట్ట వద్ద గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఆనంతరం పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్పాహారం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం స్థానికులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపద్యంలో #BhadradriKothagudem జిల్లా #Bhadrachalam లో గోదావరి పరివాహక ప్రాంత వాసులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వారిని కలిసి ధైర్యం కల్పించడమైంది. (1/2). @TelanganaCMO @MinisterKTR @KTRTRS @Collector_BDD @SpKothagudem pic.twitter.com/2OihcCfl25
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 12, 2022
ప్రస్తుతం నీటి మట్టం తగ్గుముఖం పడుతున్నప్పటికీ అధికారులు తేలికగా తీసుకోవద్దని, అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేనప్పటికీ అధికార యంత్రాంగం మరో 24గంటలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, తాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతూ.. బ్లీచింగ్ శానిటేషన్ చేయలని అదేశించారు.
రానున్న రెండు రోజుల్లో వర్షాలు మరింత ఉధృతంగా ఉంటాయని వాతావరణ శాఖా పేర్కొంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ భద్రాచలం పరిస్థితులను ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారని, వరద ఉదృతి పూర్తి స్థాయిలో నిలకడగా వచ్చే వరకు ఇక్కడే ఉంటానని మంత్రి స్పష్టం చేశారు.
వారి వెంట జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, తదితరులు ఉన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపద్యంలో #BhadradriKothagudem జిల్లా #Bhadrachalam లోని గోదావరి నది ఉదృతిని పరిశీలించడమైంది.(2/2). @TelanganaCMO @MinisterKTR @KTRTRS @Collector_BDD @SpKothagudem pic.twitter.com/6TZw7qxjEs
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 12, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)