By: ABP Desam | Updated at : 13 Jun 2023 03:12 PM (IST)
Edited By: jyothi
"మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం" ( Image Source : KTR Twitter )
Minister KTR: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళో సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని వివరించారు. ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం అంటూ రాసుకొచ్చారు. సంక్షమంలో సగం కాదు ఆమే అగ్రభాగం అని మంత్రి కేటీఆర్ వివరించారు. అమ్మఒడి వాహనమైనా.. ఆరోగ్య లక్ష్మి పథకం అయినా ఇలా ఏదైనా మహిళల కోసమే అని స్పష్టం చేశారు.
ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం...
— KTR (@KTRBRS) June 13, 2023
సంక్షేమంలో సగం కాదు.. ”ఆమే” అగ్రభాగం...
మహిళా సంక్షేమంలో..
మన తెలంగాణ రాష్ట్రం..
యావత్ దేశానికే ఆదర్శం..
అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి...
ఆరు పదులు దాటిన అవ్వల వరకు...
అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది...
మనసున్న కేసీఅర్ సర్కార్… pic.twitter.com/yN4YacJ9Rp
భర్తను కోల్పోయిన అక్కాచెల్లెల్లకు అన్నలా, ఒంటరి మహిళలకు తండ్రిలా, ఆడబిడ్డలకు మేనమామలా, అవ్వలకు పెద్ద కొడుకులా, కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. కల్యాణ లక్ష్మికేవలం పథకం కాదు ఒక విప్లవం అని మంత్రి కేటీఆర్ వివరించారు. ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్ వేస్తూనే, మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్ పెట్టిందీ పథకం అని చెప్పుకొచ్చారు. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అని పది లక్షలకు పైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసించారు. గుక్కెడు మంచినీళ్ల కోసం.. మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను, మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు.
గర్భిణీలకిచ్చే న్యూట్రిషన్ కిట్లు
— KTR (@KTRBRS) June 13, 2023
ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులు
ఆడబిడ్డ పుట్టిందంటే...
ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే...
కేసిఆర్ కిట్ తోపాటు అందే 13 వేలు..
ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు
లక్ష్మీ కటాక్షమే కాదు...
తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం… pic.twitter.com/Up7MqayVTE
గర్భిణీలకిచ్చే న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టేనని వివరించారు. కేసిఆర్ కిట్ తోపాటు అందే 13 వే, ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు అని అన్నారు. లక్ష్మీ కటాక్షమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం కూడా అందేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. కార్పొరేట్ కు ధీటైన, గురుకులాలతో తల్లిదండ్రుల కలలు సాకారం చేసిన సర్కారు ఈ సర్కారు అంటూ స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన “షీటీమ్” ఓ సంచలనం అని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే “వీహబ్” అంతకు మించినదని వివరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఓ ప్రోత్సాహం అంటూ వెల్లడించారు. ప్రతి బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ.. ఓ గొప్ప సంప్రదాయం అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు.
కల్యాణలక్ష్మి కేవలం పథకంకాదు... ఒక విప్లవం
— KTR (@KTRBRS) June 13, 2023
ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్..
మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్..
ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా
పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ
సీఎం కేసిఆర్ గారు...
గుక్కెడు మంచినీళ్ల కోసం
మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను…
Telangana Rain: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అలర్ట్ - వెల్లడించిన వాతావరణ శాఖ
ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
IT Tower In Suryapet: సూర్యాపేటలో ఐటీ టవర్, అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
Telangana News: 9999 నెంబర్ కు యమా క్రేజ్ - ఆర్టీఏకు అనేక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్లు
MLA Seethakka: తెలంగాణ యువతకు అన్యాయం, ఉద్యోగాలను బీఆర్ఎస్ అమ్ముకుంటోంది - ఎమ్మెల్యే సీతక్క
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
/body>