అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు

Weather Today: తెలంగాణలో చలిపులి పంజా విసురుతుంటే... ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Weather In Hyderabad Telangana And Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షావరణం ఉంటే తెలంగాణలో మాత్రం ఎముకలు కొరికే చలి ఇబ్బంది పెడుతోంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం చలి తీవ్రత పెరిగింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతుంది. తమిళనాడు శ్రీలంక తీరం వైపునకు వెళ్లి అక్కడ మరింత బలపడబోతోంది. ప్రస్తుత అల్పపీడన ప్రభావం కొంత వరకు కోస్తా ఆంధ్రపై కనిపిస్తోంది. ఆకాశం మబ్బులు పట్టి ఉంది. ఇది వాయుగుండంగా మారితే బుధవారం నుంచి శనివారం వరకు వివిధి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. 

శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న అల్పపీడనం దక్షిణ కోస్తాపై ప్రభావం చూపబోతోంది. ఈ సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమపై కూడా ప్రభావం ఉంటుంది. వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు బలమైన గాలులు కూడా వీస్తాయి. దీంతో చలి తీవ్రత మరింతగా పెరగొచ్చు. 

సముద్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు కారణంగా మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. నాలుగు రోజుల పాటు సముద్రంపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంటుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. రైతులు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలు
 
  ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) తేమ  శాతం
1
కళింగపట్నం 
29.3 17.5 78
2
విశాఖపట్నం 
30.2 22.8 64
3
తుని 
32.2  21.2   80
4
కాకినాడ 
31.6  23.4  85
5
నర్సాపురం 
32.8  21  73
6
మచిలీపట్నం 
32  22.6  90
7
నందిగామ 
31.5  17.5   84
8
గన్నవరం 
31  20.2  76
9
అమరావతి 
32  20.2  78
10
జంగమేశ్వరపురం 
31.5  17  84
11
బాపట్ల 
31.6  19.4  86
12
ఒంగోలు 
31.4  22.6  66
13
కావలి 
31.6  23.4  85
14
నెల్లూరు 
31.6  23.8  81
15
నంద్యాల 
31.2  18.4  86
16
కర్నూలు 
31.3  19.1  84
17
కడప 
31.4  18.5  80
18
అనంతపురం 
32.5  17.9  87
19
ఆరోగ్యవరం 
28   17  90
20
తిరుపతి 
31.5  23.2  83

తెలంగాణలో వాతావరణం (Telangana Weather): 

ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో భిన్నమైన వాతావరణం ఉంది. తెలంగాణ చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. 

హైదరాబాద్‌లో వాతావరణం (Weather Update Hyderabad)

హైదరాబాద్‌లో కూడా చలి పిడుగు భయపెడుతోంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ దారుణంగా పడిపోయాయి. రాత్రి చలి వణికిస్తుంటే ఉదయం పొగమంచు మరింత భయపెడుతోంది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చలి, పొగమంచు కారణంగా కాలుష్య తీవ్రత కూడా హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోయింది. 

వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. 
 
  ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) తేమ  శాతం
1 ఆదిలాబాద్‌  28.8  12.8  92
2 భద్రాచలం  30.0  18.2  91
3 హకీంపేట  28.2  15.2  66
4
దుండిగల్ 
29.8  16.0  74
5
హన్మకొండ  
29.5 15.0   94
6
హైదరాబాద్  
29.0  15.7   72
7
ఖమ్మం 
32.0  18.4   86
8
మహబూబ్‌నగర్  
28.9  19.1  67
9
మెదక్ 
29.2  11.3  66
10
నల్గొండ 
28.5 19.4  74
11
నిజామాబాద్ 
31.1  15.4  80
12
రామగుండం 
29.0  15.7  90
13
పటాన్‌చెరు 
28.0  12.4  91
14
రాజేంద్రనగర్ 
28.5  14  86
15
హయత్‌నగర్ 
28.6 15.6   90

Also Read: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget