CII Annual Meeting: వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, 2013తో పోలిస్తే పెట్టుబడులు రెట్టింపు - మంత్రి కేటీఆర్
CII Annual Meeting: వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ కు ఎన్నో బలాలు ఉన్నాయని పేర్కొన్నారు.
CII Annual Meeting: ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అంటే హైదరాబాద్ లోనే అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యాపారులు, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రాష్ట్రంలో అద్భుతమైన వాతావారణం ఉందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్ లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలను కల్గిన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆడోబ్ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్ లను భాగ్య నగరంలో ఏర్పాటు చేశాయని ఆయన గుర్తు చేశారు. సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని చెప్పుకొచ్చారు. వచ్చే సంవత్సరాల్లో కూడా మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టబడులు రెట్టింపు అయ్యాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్ కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయని అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.
IT & Industries Minister @KTRBRS delivered the inaugural address at @FollowCII Telangana State Annual Meeting 2022-23 & Conference on Beyond India@75. pic.twitter.com/JjEdzCN9zG
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 7, 2023
9 బిలియన్ టీకాలు నగరంలో ఉత్పత్తి అవుతున్నాయని.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్ లోనే తయారు అవుతాయన్నారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామన్నారు. సుల్తాన్ పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. లైఫ్ సైన్సెస్ తో పాటు టెక్నాలజీ రంగానికీ హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందన్నారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటిగా నగరంలోనే జరిగిందని తెలిపారు. ప్రైవేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు.
Happy to announce @TS_LifeSciences Fellowship. Inviting bright & committed professionals to join us in our mission to advance quality of human lives worldwide and contribute to our target of tripling the ecosystem value to $250 Bn by 2030. Apply now: https://t.co/tBavLs1YGz
— KTR (@KTRBRS) March 7, 2023
తెలంగాణలో పెట్టుబడులకు మంత్రి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు..!
అలాగే రాష్ట్రంలో పెట్టబడుల కోసం మంత్రి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని భారత్ బయోటిక్ ఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి వల్లే పెట్టబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం బాగుందని అన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం బాగుందని చెప్పారు. ఆవిష్కరణలను ప్రోత్సహించే టీ హబ్ మంచి ఆలోచన అని అన్నారు. పునరుత్పాదకత రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. విదేశీ కంపెనీలకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉన్నాయని సుచిత్ర ఎల్ల వివరించారు.