కేంద్ర ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన కేటీఆర్
Mission Bhagiratha: మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పారు.
Mission Bhagiratha: మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించడంపై కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. తెలంగాణలో ఇంటింటికీ మంచి నీటిని అందిస్తున్న మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పురస్కారం లభించింది. ఈ పథకం నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.
Telangana’s flagship “Mission Bhagiratha” wins national award for providing safe drinking water to all rural households
— KTR (@KTRTRS) September 29, 2022
Thanks for the recognition but it would be befitting if the NDA Govt can honour the recommendation of NITI Ayog to grant ₹19,000 Cr to this pioneering project https://t.co/hPFDuKwggE
మిషన్ భగీరథకు మరో అవార్డు
ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగు నీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరో సారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మానన పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలి పెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది. శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ “మిషన్ భగీరథ” దేశానికే ఆదర్శంగా నిలిచింది.
మారుమూల ప్రాంతాలకూ తాగునీరు, అందుకే అవార్డు
మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశీలించింది. తెలంగాణ వ్యాప్తంగా రాండమ్ గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది.
మిషన్ భగీరథతో ప్రతీ రోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగు నీరు తలసరి 100 లీటర్లతో అందుతున్నట్టు గుర్తించింది. తెలంగాణలో అమలు అవుతున్న మిషన్ భగీరథ పథకం నాణ్యత మరియు పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా, ప్రతి రోజూ నాణ్యమైన తాగు నీరు అందిస్తున్నట్లు గుర్తించబడింది.