Minister KTR: కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ఖాయం - మంత్రి కేటీఆర్
Minister KTR: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమంటూ కామెంట్లు చేశారు.
Minister KTR: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తెరాసనే మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్, భాజపాల సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. అలాగ ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉందంటే కేసీఆర్, తెరాసకు ఉన్న ఆదరణే కారణమని తెలిపారు. పార్టీలో కొన్ని చోట్ల గొడవలు ఉండడం తెరాస బలంగా ఉందనడానికి నిదర్శనం అని మంత్రి కేటీఆర్ వివరించారు.
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు..
అయితే రాష్ట్రంలో బలంగా ఉన్న నేతలను తెరాస పార్టీ కలుపుకొని పోతుందని..,ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రమంతా ఉన్నది ఒక్క తెరాస పార్టీయేనని వెల్లడించారు. 90 కి పైగా స్థానాల్లో తెరాసనే గెలుస్తుందని.. తమ సర్వేలో వెల్లడైనట్లు వివరించారు. అయితే రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పేర్కన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆనందంగా చెప్పారు.
2023లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు...
బీజేపీకి మంచి పనులతో ప్రజల మనుషులు గెలుచుకోవడం తెలియదని రాష్ట్ర మంత్రి కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికీ బెదరడు, లొంగడని తెలిపారు. కొంరీదరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెరాస నుంచి కొంత మంది నేతలు వెళ్ళవచ్చు.. తమ పార్టీకి కూడా ఇతర పార్టీల నుంచి నేతలు రావొచ్చని అన్నారు. అయితే 2023లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ విపక్షాలు కావాలనుకుంటే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు.
శత్రుదేశాలపై పెట్టినట్లు ఆంక్షలు పెడ్తున్నరు..
అన్ని వ్యవస్థలతో పాటు ఈసీ కూడా కేంద్రం చేతిలోనే ఉందన్నాడు మంత్రి కె తారక రామారావు. రాష్ట్రాల్లో వానలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి ఉవుతుంటూ ఉపాధి హామీలో అక్రమాలు అంటూ కేంద్ర బృందాలను పంపిందని విమర్శించారు. రైతులకు ఫార్మ్ ప్లాట్ ఫామ్ లాంటి మంచి పనులు చేస్తే అక్రమాలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం ఉన్న ప్రధాని అయితే వరదలు వచ్చినపుడు ముందస్తు సాయం అందించాలని మంత్రి అన్నారు. శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు అప్పుల విషయంలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూపాయి విలువ పడిపోతే దేశం ఆత్మగౌరవం పడిపోతుందని మోడీ ఆనాడు అన్నారని గుర్తు చేశారు. అదే మాటను ఇప్పుడు దేశ ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ చేసిన సర్వేల్లో తెరాసదే విజయం అని తేలిందని.. వారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నారని మంత్రి కీటీఆర్ వెల్లడించారు.