Medak News : అత్త బంగారం పెట్టలేదని హర్ట్ అయిన అల్లుడు, కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్!
Medak News : మెదక్ లో వింత ఘటన జరిగింది. అత్త గారు బంగారం పెట్టలేదని హర్ట్ అయిన అల్లుడు కరెంట్ స్తంభం ఎక్కాడు.
Medak News : మెదక్ లో వింత ఘటన చోటుచేసుకుంది. అత్త గారు వాళ్లు బంగారం పెట్టలేదని హర్ట్ అయిన అల్లుడు ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. కాసేపు హల్ చల్ చేశాడు. ఈ ఘటన మెదక్ పట్టణం పరిధిలోని గాంధీనగర్ లో ఆదివారం చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శేఖర్. తమ పెళ్లికి అత్త బంగారం పెడతానని చెప్పి పెట్టలేదని మనస్తాపంతో కరెంటు స్తంభం ఎక్కాడు. అతడ్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చింది. విద్యుత్ సరఫరా నిలిపివేసి అతడినికి నచ్చజెప్పారు. విషయం తెలుసుకుని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బట్టి జగపతి, డీఎస్పీ సైదులు , సీఐ అతనికి నచ్చజెప్పడంతో శేఖర్ కిందకు దిగి వచ్చాడు. దీంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నాను.
బురదలో పొర్లుతూ అల్లుడికి స్వాగతం
పెళ్లి తర్వాత అత్తారింటికి అల్లుడు వస్తున్నాడంటే హడావిడి మామూలుగా ఉండదు. బ్యాండ్, బాజాలు, డీజేలు, బాణాసంచా ఎవరి స్థోమతను బట్టి వాళ్లు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఓ వింత ఆచారం ఉంది. అమ్మాయి తరుపువాళ్లు గేదెల్లా వేషం వేసుకుని బురదలో దొర్లుతూ వరుడికి స్వాగతం పలికారు. ఇదేం ఆచారం అనుకుంటున్నారా? ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఓ తెగవారు ఈ సాంప్రదాయాన్ని నేటికీ పాటిస్తున్నారు. దేశంలో ఒక్కో జాతికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. మైన్‌పట్ నర్మదాపుర్ ప్రాంతంలో ఉండే తెగవాళ్లు ఈ సంప్రదాయం పాటిస్తారు. వధువు సోదరులు గేదెల్లా వేషం వేసుకుని, నడుము వెనుక ఓ తోకను తగిలించుకని బురదలోకి దొర్లుతారు. గేదెల్లా ప్రవర్తిస్తూ బురదలో పడి దొర్లడం, పోట్లాడటం, పరిగెత్తడం చేస్తారు. అనంతరం ఊరేగింపుగా వచ్చి వరుడికి స్వాగతం పలికి అత్తింటికి తీసుకెళ్తారు. తరతరాలుగా వస్తున్న ఈ వివాహ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుండటం ఈ ప్రాంతంలో విశేషం.
మేనల్లుడి పెళ్లిలో నోట్ల వర్షం
సోషల్ మీడియా ఇప్పుడిదే అందరి ప్రపంచం. జస్ట్ అలా ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు. బోలెడంత కంటెంట్. వీడియోలైతే చెప్పనవసరం లేదు. స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని విపరీతంగా వైరల్ అవుతాయి. మొన్నా మధ్య బెంగళూరులో ఓ వ్యక్తి బ్రిడ్జ్ పై నుంచి నోట్ల వర్షం కురిపించిన వీడియో చాలా రోజుల పాటు వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్‌లోని మెషనా జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ తన ఇంటి డాబాపై నుంచి నోట్ల వర్షం కురిపించాడు. ఎన్ని లక్షలు అలా పై నుంచి నోట్లు విసురుతూనే ఉన్నాడు. తన మేనల్లుడికి పెళ్లి జరుగుతోందన్న సంతోషంలో ఇలా చేశాడు. కెర్రీ తహసీల్లోని అగోల్ గ్రామంలో తన మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ కరీమ్ యాదవ్ ఊరేగింపు నిర్వహించాడు. ఆ సమంలోనే బిల్డింగ్‌పై నిలబడి రూ.500 విలువైన నోట్లను ప్రజలపై విసిరాడు. దాదాపు రూ.5 లక్షలు ఇలా విసిరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. జోధా అక్బర్‌లోని అజీమ్ ఓ షాన్ షెహన్‌షా అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతోంది. పైన నిలబడి ఆ వ్యక్తి పూలు జల్లినంత సింపుల్‌గా నోట్లు చల్లుతూ కనిపించాడు.