By : ABP Desam | Updated: 11 Aug 2021 11:00 AM (IST)
శ్రీనివాస్‌ను కారులోనే కత్తితో పొడిచి చంపిన నిందితులు.. దాదాపు ఆరు గంటల పాటు ఆ కారులోనే తిరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. అయితే, వారు లోన్ తీసుకొని శ్రీనివాస్‌కు అప్పు ఇచ్చినా.. ఆయన తిరిగి ఇవ్వలేదని అందుకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లాలో హత్యకు గురైన ధర్మాకర్ శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణమని ప్రచారం జరగ్గా అది కారణం కాదని విచారణలో పోలీసులు తేల్చారు. ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని పోలీసులు ధ్రువీకరించారు. దాదాపు రూ.కోటిన్నర నగదు లావాదేవీలే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. ఈ ఆర్థిక లావాదేవీల్లో ధర్మాకర్ శ్రీనివాస్‌కు, మెదక్‌కు చెందిన మరో వ్యక్తికి మధ్య విభేదాలు తలెత్తినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి నిందితులను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
KTR Comments : EV ఇండస్ట్రీలో మూడేళ్లలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులు - తెలంగాణకు రానున్నాయన్న కేటీఆర్ !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !