అన్వేషించండి

PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!

Adilabad Ration Rice Racket: ఆదిలాబాద్ లో రేషన్ మాఫియా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. యూపీకి తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

Adilabad PDS Smuggling :  పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం..  చేతులు మారి సరిహద్దులు దాటుతోంది. నిరుపేదల నోటి కూడును కొల్లగొట్టి, ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు కుమ్మరిస్తున్న అంతర్రాష్ట్ర రేషన్ మాఫియా గుట్టును ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అధికారులు నాటకీయ పరిణామాల మధ్య రట్టు చేశారు. ఒకవైపు హైదరాబాద్ సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి, మరోవైపు ఆదిలాబాద్ రూరల్ పోలీసుల చాకచక్యమైన వాహన తనిఖీలతో.. కరీంనగర్ నుండి ఉత్తరప్రదేశ్ వరకు, ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర దాకా విస్తరించిన నల్లబజారు నెట్‌వర్క్ ఒక్కసారిగా కుప్పకూలింది.

 యూపీ లారీని ముట్టడించిన టాస్క్ ఫోర్స్! 

మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై అర్ధరాత్రి వేళ ఒక భారీ లారీ  వేగంగా దూసుకుపోతోంది. అయితే, ఆ వాహనం కదలికలపై హైదరాబాద్ సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ముందే పక్కా సమాచారం అందింది. డీఎస్పీ శేఖర్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం నాటకీయ పద్ధతిలో ఆ లారీని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. అధికారులు లారీ వెనుక భాగాన్ని తెరిచి చూడగా.. బస్తాల కింద దాచి ఉంచిన సుమారు 28,000 కిలోలు  ప్రభుత్వ రేషన్   బియ్యం బయటపడింది. ప్రాథమిక విచారణలో ఈ బియ్యాన్ని కరీంనగర్ నుండి ఏకంగా ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు నస్పూర్ ఎంఎల్ఎస్  పాయింట్‌కు తరలించి, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

 ఖిల్లా అద్దెగదిలో  నల్ల నిల్వలు.. స్కూటీ తెచ్చిన ముప్పు! 

ఇటు ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ ఎక్స్ రోడ్ వద్ద రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ బృందం సాధారణ వాహన తనిఖీలు చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఒక స్కూటీపై రెండు భారీ బస్తాలతో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో వారు షేక్ అఫ్సర్, ఎం.డి. రిజ్వాన్‌గా తేలింది. ఆ బస్తాల్లో ఉన్నది రేషన్ బియ్యమేనని గుర్తించిన పోలీసులు, వారి స్టైల్లో నిలదీసేసరికి అసలు రహస్యం బద్దలైంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఖిల్లా ప్రాంతంలో ఒక అద్దె ఇల్లు తీసుకుని, దాన్ని రేషన్ బియ్యం డంపింగ్ యార్డ్‌గా మార్చినట్లు వారు అంగీకరించారు. పోలీసులు తక్షణమే ఆ అద్దె గదిపై దాడి చేయగా.. అక్కడ 50 ప్లాస్టిక్ సంచుల్లో దాచిన మరో 25 క్వింటాళ్ల బియ్యం లభ్యమైంది.

 రేషన్ డీలర్ల హస్తం ..  బ్రాండెడ్ రైస్ ముసుగులో దందా! 

ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠా వెనుక ప్రభుత్వ వ్యవస్థలోని పురుగులే కీలక పాత్ర పోషించాయి. నిందితులు షేక్ అఫ్తాబ్, అబ్దుల్ సత్తార్‌లతో కలిసి పట్టణంలోని ముగ్గురు రేషన్ షాపు నిర్వాహకులు చేతులు కలిపారు. షాప్ నెం.15 నిర్వాహకుడు కొమ్ము రాము, షాప్ నెం.18 కి చెందిన అబ్దుల్ రహీమ్, షాప్ నెం.07 తో సంబంధం ఉన్న రాచేకర్ విలాస్.. పేదలకు ఇవ్వాల్సిన రాయితీ బియ్యాన్ని తక్కువ ధరకు ఈ ముఠాకు అమ్ముకున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని కారుచీకట్లో మహారాష్ట్రకు చెందిన ఫరాన్ అనే వ్యక్తికి తరలించేవారు. అక్కడ ఈ రేషన్ బియ్యాన్నే పాలిష్ పట్టి, సరికొత్త సంచుల్లో నింపి,  బ్రాండెడ్ రైస్ పేరుతో మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.

 ఏడుగురు జైలుకు.. ఒకరు పరారీ 

ఈ వ్యవస్థీకృత రేషన్ దందాపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేయగా, అందులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు, మహారాష్ట్ర లింక్ అయిన ఫరాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుల నుండి మొత్తం 26 క్వింటాళ్ల బియ్యం, ఒక స్కూటీ, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులందరినీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బైండోవర్ చేస్తున్నట్లు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. పేదల బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, రేషన్ మాఫియాపై జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Embed widget