అన్వేషించండి

Malkajgiri Loksabha: మల్కాజ్‌గిరిలో పోరు ఆసక్తికరం - ఒక్క ఛాన్స్ అంటున్న బీఆర్ఎస్, బీజేపీ! రేవంత్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్

Telangana Elections 2024: దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి సీటును ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నారు. సిట్టింగ్ సీటు నిలుపుకోవాలని కాంగ్రెస్ తాపత్రయం.

Malkajgiri MP Candidates Fight: హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ సీటుపై ఫోకస్ పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో మ‌ల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. సిట్టింగ్ సీటు కూడా కావడంతో మల్కాజిగిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ అధిష్టానం ఉవ్విల్లూరుతోంది. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకే నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టారు. 

సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ 
గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మల్కాజిగిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. బ‌ల‌మైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్‌లో ఉన్న వికారాబాద్ జెడ్పీ చైర్ ప‌ర్సన్ సునీతా మ‌హేంద‌ర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని అభ్యర్థిగా ప్రకటించారు. అసలే మ‌ల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే మిని ఇండియాగా పేరుంది. నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 

మల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో దేశ ర‌క్షణ‌ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్‌, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక‌రంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలకు  కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఓటర్ల ప్రకారం చూస్తే దేశంలోనే అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గంగా మ‌ల్కాజిగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హైద‌రాబాద్‌కు తూర్పు వైపున ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 38 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం 2009లో ఏర్పడింది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా మ‌ల్కాజిగిరి నియోజకవర్గంగా అవతరించింది. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లో రెండు సార్లు కాంగ్రెస్‌, ఒక్కసారి టీడీపీ గెలుపొందాయి. అయితే ఈసారి మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ నియోజకవర్గంలో నెగ్గాలని వ్యూహాలు రచిస్తున్నాయి. 

తన నియోజ‌క‌వ‌ర్గం కావడంతో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. మూడెంచ‌ల విధానంతో గెలుపుబావుట ఎగుర‌వేయాల‌ని భావిస్తున్నారు. సీనియ‌ర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియ‌మించింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని మల్కాజిగిరిలో బరిలో దింపారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా, విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని చూస్తోంది కాంగ్రెస్. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. 

ప్రధాన ప్రతిప‌క్షం బీఆర్‌ఎస్ ఈ సారి మ‌ల్కాజిగిరిలో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఒక్కసారి కూడా నెగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో ఈసారి విజయంపై కొండంత ఆశగా ఉన్నారు. ఎమ్మెల్యేలంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉండ‌టంతో గెలిచి తీరాల‌ని పట్టుదలతో ఉంది. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హించిన స్థానం కావ‌డంతో గెలిచి కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాల‌ని బీఆర్ఎస్ ప్లాన్ చూస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల తరహాలోనే ఓట‌ర్లు ఈసారి బీఆర్‌ఎస్‌నే ఆద‌రించి, తొలిసారి మల్కాజిగిరిలో గులాబీ పార్టీకి విజయం అందిస్తారని ధీమాగా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారం కోల్పోవ‌డంతో ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు వెళుతుందా అని అనుమానాలు సైతం లేకపోలేదు.

మోదీ మేనియా పని చేస్తుందా?
మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం వ్యూహాలు రచిస్తోంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీల‌క పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోదీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మ‌ల్కాజిగిరి సీటు నెగ్గకపోవడంతో తో ఈసారి ఖ‌చ్చితంగా సాధించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంత‌గా ప్రభావం చూపలేదు. గ‌త 3 ఎన్నిక‌ల్లో పాజిటివ్ రిజల్ట్స్ రాకపోయినా.. ఈసారి మాత్రం మోదీ మేనియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండగా, కనీసం ఒక్కసారైనా మల్కాజిగిరిపై తమ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Embed widget