By: ABP Desam | Updated at : 09 Jan 2022 09:33 AM (IST)
MahenderReddy
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా కొవిడ్ బారిన పడుతున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ తరువాత తెలంగాణతో పాటు దేశంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
ఆయనకు కాస్త నలతగా అనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. కొవిడ్ టెస్టుల్లో మహేందర్ రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు టీఆర్ఎస్ నేత తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతున్న సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మహేందర్ రెడ్డి తెలిపారు.
Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలు నిషేధం.. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు అమలు !
Koo Appతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. టెస్టులు చేయించుకోగా మహేందర్ రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది #Corona #Telangana #MahenderReddy #Covid19 https://telugu.abplive.com/telangana/mahender-reddy-covid-positive-trs-mlc-mahender-reddy-tests-positive-for-covid-19-17495 - Shankar (@guest_QJG52) 9 Jan 2022
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 73,156 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 2,606 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. అదే సమయంలో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,041కి చేరింది. కరోనా నుంచి శుక్రవారం 285 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1583 కేసులు నమోదయ్యాయి.
Also Read: New Variant: ఒమిక్రాన్ - డెల్టా రకాల లక్షణాలతో కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’,ఏ దేశంలో బయటపడిందంటే...
Also Read: Corona Cases: ఢిల్లీ, ముంబయిలోనే 40 వేలకు పైగా కరోనా కేసులు.. బెంగాల్‌లోనూ పరిస్థితి
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు