అన్వేషించండి

LB Nagar : గోడలకెక్కిన కాంగ్రెస్ టిక్కెట్ల పంచాయతీ - పాపం మధుయాష్కీ !

ఎల్బీ నగర్ టిక్కెట్ కోసం మధుయాష్కీ దరఖాస్తు చేసుకోవడం కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. ప్యారాచూట్ నేతలు వద్దంటూ గోడలపై పోస్టర్లు వేశారు.

 

LB Nagar :  కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ ప్రారంభమయింది. టిక్కెట్ల దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడంతో ఎవరెవరు ఎక్కడెక్కడ టిక్కెట్లు ఆశిస్తున్నారో క్లారిటీ వచ్చింది. దీంతో ఒకరిపై ఒకరు రాజకీయాలు ప్రారంభించుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయం గోడలకు ఎక్కింది.                   

ఎల్పీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కాంగ్రె్స ప్రచార కమిటీ కమిటీ చైర్మన మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన స్థానికుడు కాదు. ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అయితే హఠాత్తుగా ఆయన ఎల్బీనగర్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం .. ఎల్బీనగర్ నియోజకవర్గ నేతల్లో కలకలం రేపింది.  దీంతో ఆయనకు వ్యతిరేకంగా గాంధీభవన్‌లో  పోస్టర్లు వేశారు.  పారాచూట్‌ నాయకులకు టికెట్‌ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సేవ్‌ ఎల్బీనగర్‌   కాంగ్రెస్  .. , మధు యాష్కి గో బ్యాక్‌ టు నిజామాబాద్‌ అంటూ పోస్టర్లు వెలిశాయి.

2009 ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించిన మధుయాష్కి.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. దీంతో ఆయన ఈసారి పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా నుంచి కాకుండా.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో ప్రముఖ బీసీ నేతగా ఉన్న తనకు అడిగిన చోట టిక్కెట్ ఖరారు చేస్తారని మధుయాష్కీ ఆశలు పెట్టుకున్నారు.                                                       

అయితే ఎల్బీ నగర్‌లో  స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు, మరో నాయకుడు జక్కిడి ప్రభాకర్‌ రెడ్డి సైతం అభ్యర్థిత్వం కోసం అప్లయ్‌ చేసుకున్నారు. లింగోజి గూడ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలిచిన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో టిక్కెట్ పోటీ తీవ్రమయింది. కష్టకాలంలో కూడా నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమకు కాకుండా మరొకరికి టికెట్‌ ఇస్తారేమోనని అక్కడి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో యాష్కికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో పోస్టర్లు వెలిసినట్లుగా తెలుస్తోంది.                         

ఈ అంశంపై మధుయాష్కీ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆయన ఎల్పీనగర్ కోసం ఎలాంటి కృషి చేయలేదని.. ఆయనకు టిక్కెట్ ఎందుకివ్వాలన్న వాయిస్ లు పెరుగుతూండటంతో మధుయాష్కీకి ఇబ్బందికరంగానే మారింది.                          

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget