Telangana IT Minister కేటీఆర్‌కు అరుదైన గౌరవం, ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు ఆహ్వానం
Harvard India Conference: భారతదేశ పురోగతి అతి వేగంగా జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపార వాణిజ్యము, ఐటీ అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.
KTR to Address Harvard India Conference: తెలంగాణ ఐటీ శాఖ మంత్రికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక మీద కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకుల నుంచి ఇప్పటికే ఆహ్వానం అందింది.
మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 20వ తేదీన మంత్రి కేటీఆర్ ఇండియా @2030 - ట్రాన్స్‌ఫర్ నేషనల్ డికేడ్ అనే అంశంపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి 8 గంటల మధ్య (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల మధ్య) కేటీఆర్ ఈ సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్నారు. తన ప్రసంగంలో కేటీఆర్ ఆయా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తన విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు.
Elated to have the H'ble Minister @KTRTRS deliver a keynote address at the conf! We look forward to hearing from him on the development he has undertaken in the State of Telangana and his views on Turbocharging India @ 2030!
— India Conference at Harvard (@HarvardIndiaCon) February 18, 2022
Free & virtual, register here https://t.co/6jZd0mhROm pic.twitter.com/PXLZerDyoQ
ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి అతి వేగంగా జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపార వాణిజ్యము, ప్రభుత్వ విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease Of Doing), బిజినెస్ మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్ ఇంక్యుబేటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలు, నిర్ణయాలపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తన ఆలోచనలను పంచుకుంటారు. తనను ఆహ్వానించడంపై హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాన్ఫరెన్స్ లో భాగస్వామి అయ్యేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కొంపల్లి కండ్లకోయలో తెలంగాణ గేట్ వే భారీ ఐటీ పార్కును కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు.
Also Read: KTR In Sircilla: సరిగ్గా 8 ఏళ్ల కిందట ఏం జరిగింది? అలా మాట్లాడితే పుట్టగతులుండవు: మంత్రి కేటీఆర్