అన్వేషించండి

KTR : నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత - ప్రతిపక్షంగా నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరిక

BRS : కాంగ్రెస్ ప్రభుత్వంపై నెల రోజుల్లోనే వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ అన్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షంగా నిలదీస్తామంటున్నారు.


KTR :  విధ్వంసమైన తెలంగాణను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పదేండ్ల పాలనలో వికాసం వైపు నడిపించారు. రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) అన్నారు. బుధవారం వరంగల్‌ లోక్‌సభ (Warangal Lok Sabha) నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు.  కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు 420 హామీలు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇద్దామనుకున్నాం. కానీ, గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో బీఆర్ఎస్ ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మా మీద అకారణంగా నిందలు వేస్తె ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. అందుకే అసెంబ్లీలో కాంగ్రెస్ ను గట్టిగా నిలదీశామని చెప్పారు.

కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపైన తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనేలేదని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క అబద్దమాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతోనే ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రద్దు చేస్తోందని, వాటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోందన్నారు. పేదలకు మనం అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేటీఆర్. జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని కేటీఆర్ నిలదీశారు.
   
”ప్రజలు మనతో ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నాం. ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ. వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారు. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల. 2014, 2019లో వరంగల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి కూడా వరంగల్ లో గులాబీ జెండా ఎగరాలి. ఇది 8వ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన సన్నాహక సమావేశం. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయి. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటాం.

పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి.. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దాం. కార్యకర్తల్లో ఉత్సాహం యధావిధిగా ఉంది. ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలి. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం మనం గుర్తుంచుకొని ముందుకు పోదాం. కేసీఆర్ కరెంటు పరిస్థితి బాగు చేశారని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు. చెమట ధార పోశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయి. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని పార్టీ శ్రేణులకు సూచించారు కేటీఆర్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget