అన్వేషించండి

KTR met MLC Kavitha: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్

Telangana News: ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు. అధైర్య పడొద్దని, న్యాయం తమవైపే ఉందని కేటీర్ చెప్పారు.

KTR met MLC Kavitha CBI headquarters in Delhi- న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేయడం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం రెండో రోజు ఢిల్లీలోని తమ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. 

KTR met MLC Kavitha: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్

ఆదివారం (ఫిబ్రవరి 14న) సాయంత్రం 6 గంటలకు కవిత సీబీఐ విచారణ ముగిసింది. ప్రస్తుతం మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను కలిసి ధైర్యం చెప్పారు. న్యాయం తమవైపే ఉందని, అధైర్యపడవద్దని కవితకు సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. సోమవారం సీబీఐ కస్టడీ ముగియనుండటంతో మంగళవారం ఉదయం 10 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. కవిత కస్టడీ పొడిగించాలని సీబీఐ తరఫు లాయర్లు కోర్టును కోరనున్నారు.  

కవిత పిటిషన్లు తోసిపుచ్చిన న్యాయస్థానం
ఎమ్మెల్సీ కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అంతకు ముందు ఆమె దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని, అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్లు దాఖలు చేశారు. అడిగిన ప్రశ్నలనే సీబీఐ మళ్లీ మళ్లీ అడుగుతోందని, తనను కస్టడీకి ఇవ్వొద్దని కోరారు. కానీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌ కు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16న (మంగళవారం) విచారణ జరగనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Animal Park Update : 'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget